Watch: Street Food Vendor Makes Dancing Bhel Puri, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

డ్యాన్సింగ్ భేల్ పూరీ.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్

Published Wed, Jun 7 2023 5:02 PM | Last Updated on Wed, Jun 7 2023 5:36 PM

Street Food Vendor Makes Dancing Bhel Puri  - Sakshi

'భేల్ పూరీ' భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ స్నాక్స్‌లో ప్రధానమైనది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ వంటకాన్ని తెగ ఇష్టపడతారు. ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకత ఉంటుందీ భేల్ పూరీకి. తాజాగా దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన  ఓ వీడియో ఫుడ్ లవర్స్‌ను ఆకర్షించింది.

ఈ కొత్త వంటకం పేరే డ్యాన్సింగ్ భేల్ పూరీ. ఇందులో ఉపయోగించే 60 రకాల పదార్థాలు మాత్రమే కాదు అది చేసే విధానంలోనే కొత్తదనం ఉంటుంది. దీన్ని తయారు చేసేప్పుడు దుకాణదారుడి ఉత్సాహం, లయబద్దమైన డ్యాన్స్‌తో దీనికి మరింత రుచిని తెచ్చిపెడతాయి.

ఈ వీడియోలో దుకాణదారుడు భేల్‌ పూరీని తయారు చేయడానికి సిద్ధపడినప్పుడు దానికి కావల్సిన అన్ని పదార్థాలను ఓ పాత్రలోకి తీసుకుంటాడు. అనంతరం ఓ ప్రత్యేకమైన విధానంలో లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ ఆ పదార్థాలన్నింటిని కలియబెడతాడు. కిందికి మీదికి తిప్పుతూ అతడు చేసే గారడి చూస్తే.. 'అరె..! భలే తిప్పుతున్నాడే' అనిపించక మానదు. చిటికెలోనే భేల్ పూరీని ప్లేట్‌లో వేసేస్తాడు. 

ఈ వీడియో నెట్టింట వైరల్‍గా మారింది. నెటిజన్స్ స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. అతని ఎనర్జీ భేల్‌ పూరీకి మరింత టేస్టును తీసుకువచ్చిందని కొందరు కామెంట్ చేశారు. అతడు డ్యాన్స్ చేసే క్రమంలో చాలా ఫుడ్ కిందపడిపోతుందని మరికొంతమంది  స్పందించారు. 

ఇదీ చదవండి: ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టు.. మిన్నంటిన ఆందోళనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement