భోపాల్: చదువులు నేర్పించిన టీచర్‌పైనే విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. యోగక్షేమాలను కనుక్కుంటూనే దాడి చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు అడిగారనే పిస్టల్‌తో హత్యాయత్నం చేశారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా జౌరా రోడ్ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది..
గిర్వార్ సింగ్‌ను విద్యార్థులు ఇంటి బయట నుంచి పిలిచారు. ఉపాధ్యాయుడు బయటికి రాగానే ఎలా ఉన్నారంటూ చర్చను ప్రారంభించారు. ఇంతలోనే ఓ కుర్రాడు జేబులోంచి పిస్టల్ తీసి సార్‌ను కాల్చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే.. విద్యార్థులు గత మూడేళ్ల క్రితం వరకు గిర్వార్ సింగ్ కోచింగ్ సెంటర్‌లో విద్యను నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫీజులు మాత్రం చెల్లించలేదు. పలు సందర్భాలలో ఆ డబ్బులపై విద్యార్థులను ప్రశ్నించారు గిర్వార్ సింగ్. దీంతో కక్ష పెంచుకున్న నిందితులు సార్‌పై దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి: రైల్లో మహిళతో అసభ్యకర ప్రవర్తన.. అడ్డుకుందని బయటకు తోసేశారు
Comments
Please login to add a commentAdd a comment