Sukesh Chandrasekhar Strong Comments ON BRS MLC Kavitha Reaction, Details Inside - Sakshi
Sakshi News home page

సుఖేష్‌ మరో సంచలన లేఖ.. నేను ఛాట్‌ చేసింది కవితక్కతోనే.. ప్రూఫ్‌ అంటూ ఫోన్‌నెంబర్లతో స్క్రీన్‌షాట్లు

Published Sat, Apr 15 2023 3:31 PM | Last Updated on Sat, Apr 15 2023 7:22 PM

Sukesh Chandrasekhar Strong Comments ON BRS MLC Kavitha Reaction - Sakshi

ఢిల్లీ: తీహార్‌ జైలు నుంచి ఆర్థిక నేరగాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌ మరో లేఖ విడుదల చేశాడు. తాను ఛాట్‌ చేసింది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతోనే నంటూ స్పష్టం చేస్తూ తాజా లేఖలో పేర్కొన్నాడు. సుఖేష్‌ ఎవరో తనకు తెలియదంటూ కల్వకుంట్ల కవిత ట్విటర్‌ ద్వారా స్పందించిన నేపథ్యంలో.. ఆమెకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తూ సుఖేష్‌ ఐదు పేజీల లేఖలో కవితపై విమర్శలు చేశాడు. 

నేను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవితక్కతోనే. ఆమె నెంబర్లు ఇవే అంటూ లేఖ ద్వారా స్క్రీన్‌షాట్‌ను విడుదల చేశాడు సుఖేష్‌. ఆ నెంబర్లు 6209999999, 8985699999గా ఉన్నాయి. అలాగే ఇంకో ఛాట్‌లో సత్యేంద్ర జైన్‌ వ్యక్తిగత ఫోన్‌ నెంబర్‌ 919810154102గా లెటర్‌లో పేర్కొన్నాడు సుఖేష్‌.  

అంతేకాదు.. కవిత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘తీహార్‌ క్లబ్‌’కు వస్తున్నారంటూ వెల్‌కమ్‌ చెబుతూ రాశాడు. ‘‘కేజ్రీవాల్‌ తర్వాత నీ వంతే అంటూ కవితను ఉద్దేశించాడు సుఖేష్‌.  కవితను తాను కవితక్క అని పిలుస్తానని, ఆమెను తన పెద్దక్కగా భావించానని సుఖేష్‌ తెలిపాడు. ట్విటర్‌ ద్వారా సమాధానలు ఇవ్వొద్దని, అవన్నీ పాత ట్రిక్కులనీ, పని చేయవంటూ లేఖలో కవితను ఉద్దేశించి పేర్కొన్నాడు సుఖేష్‌.  

నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు.  మీరు కూడా అందులో భాగస్వాములే. దేశ ప్రయోజనాల రీత్యా సత్యం మాట్లాడాలి.  ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలంటూ కవితకు లేఖ ద్వారా సవాల్‌ విసిరాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌.

అతి త్వరలో కేజ్రీవాల్‌తో చేసిన ఛాటింగ్‌ను సైతం రిలీజ్‌ చేస్తా అంటూ లేఖ ద్వారా పేర్కొన్నాడు. కోర్టు ధ్రువీకరణతో ఎవిడెన్స్ చట్టం 65 బి కింద తాను స్క్రీన్ షాట్లను విడుదల చేశానని వెల్లడించిన సుఖేష్‌..  కవితక్క కు రూ. 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైం లో కేజ్రీవాల్, సత్యెంద్ర జైన్ తోనూ మాట్లాడిన స్క్రీన్‌ షాట్లను విడుదల చేస్తానంటూ తెలిపాడు. తనను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు అర్థరహితమన్న సుఖేష్‌.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా నంటూ లేఖలో పేర్కొనడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement