న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు జూన్ 15 వరకు గడువు విధించింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు అధికార పార్టీకి కోర్టు సుధీర్ఘ గడువు ఇచ్చింది.
అయితే ఢిల్లీ జిల్లా కోర్టును విస్తరించే నిమిత్తం ఈ స్థలాన్ని ఢిల్లీ హైకోర్టుకు కేటాయించిన నేపథ్యంలో ఆప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ప్రదేశంలో కొనసాగే హక్కు ఆప్‌కు లేదని పేర్కొంది. పార్టీ కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ స్థలం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినించింది.
ఈ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేసి.. తదుపరి నిర్ణయాన్ని నాలుగు వారాల్లో తమకు తెలియజేయాలని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని కోరింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కేజ్రీవాల్ వర్చువల్ విచారణపై ఈడీ స్పందన
Comments
Please login to add a commentAdd a comment