2011 ఎస్‌ఈసీసీ డేటాలో లోపాలు!  | Supreme Court Says SECC 2011 Is Not OBC Data | Sakshi
Sakshi News home page

2011 ఎస్‌ఈసీసీ డేటాలో లోపాలు! 

Published Wed, Dec 15 2021 7:58 AM | Last Updated on Wed, Dec 15 2021 7:58 AM

Supreme Court Says SECC 2011 Is Not OBC Data - Sakshi

న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం చేపట్టిన సామాజికార్థిక కులగణన(ఎస్‌ఈసీసీ–2011) గణాంకాల్లో లోపాలున్నాయని,  ఓబీసీల డేటాకు సంబంధం లేదని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. లోపభూయిష్ట సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనే ఈ నివేదికను బహిర్గతం చేయలేదని తెలిపింది. ఓబీసీలకు రిజర్వేషన్లను తాము సమర్థిస్తామని, అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ సుప్రీం రాజ్యాంగ బెంచ్‌ తీర్పునకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది.

చదవండి: లైన్‌ క్లియర్‌.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట 

ఎస్‌ఈసీసీ 2011 వివరాలను తమకందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తాము ఎన్నిమార్లడిగినా కేంద్రం ఈ గణాంకాలు అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై సమాధానమిచ్చిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, ఈ గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు, ఇతర ఏ అంశాలను చేపట్టలేమని, ఇందులో లోపాలున్నాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement