
న్యూఢిల్లీ : భారత సమాఖ్య వ్యవస్ధ పైన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు "సర్జికల్ స్ట్రైక్" చేయడానికి కేంద్రం గవర్న్‌మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్‌సీటీడీ) సవరణ బిల్లును తీసుకువచ్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్‌కు తాను మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. బుధవారంతృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో, బీజేపీ యేతర ముఖ్యమంత్రులు, బీజేపీని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలందరికీ తమ మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ బిల్లుపై ఎందుకంత రగడ
ఢిల్లీ అసెంబ్లీ చేసే ప్రతీ చట్టానికి సంబంధించి ‘ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్ గవర్నర్’ అనే అర్థాన్ని ఈ బిల్లు నిర్వచిస్తుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయంపై అయినా ముందుగా ఎల్జీ అభిప్రాయం తీసుకోవడం తప్పని సరి అని ఆ బిల్లులో పొందుపర్చారు. రాజధానిలో ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వాన్ని బలహీనపరిచి, ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాను తగ్గిస్తూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు సబార్డినేట్‌గా మార్చాలని కేంద్రం ఇలాంటి బిల్లులను ప్రవేశపెట్టిందంటూ మమతా మండిపడ్డారు.
అలాగే 2018 లో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ బిల్లు ఉల్లంఘిస్తోందన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న చట్టబద్ధమైన అధికారాలను తొలగించి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ద్వారా ముఖ్యమంత్రిని లొంగదీసుకునే చర్య అని విమర్శించారు .ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక చర్యగా ఆమె అభివర్ణించారు.
"పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో, గవర్నర్లు బీజేపీ కార్యాలయ అధికారుల వలె పనిచేస్తున్నారు తప్ప తటస్థ రాజ్యాంగ అధికారుల వలె కాదు" ఎద్దేవా చేశారు. "2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ అద్మీ పార్టీ చేతిలో బిజెపి ఎదుర్కొన్న అవమానకరమైన ఓటమిని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ జీర్ణించుకోలేక ఎలాగైనా ఢిల్లీని పాలించే ఉద్దేశ్యంతోనే, జీఎన్‌సిటిడి చట్టానికి ప్రతిపాదిత సవరణల నిజమైన ఉద్దేశ్యమని చెప్పారు. కాగా 2021 లోని గవర్న్‌మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లును కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
( చదవండి : కాళ్లపై పడేందుకైనా సిద్ధం..: కేజ్రీవాల్)
Comments
Please login to add a commentAdd a comment