ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతం అవుతుందని యావత్ దేశం ఎదురుచూస్తోంది. విక్రమ్ ల్యాండర్ నేడు సాయంత్రం 6.04 నిమిషాలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్ంగ్ కానుంది. దాదాపు నాలుగేళ్లుగా 1000 మంది శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి ఫలితం దక్కనుందని ఇస్రో ఛైర్మని సోమనాథ్ తెలిపారు.
సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2019లో ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే.. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియలో ఈ మిషన్ విఫలమైంది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుకు ముందు భారత్ చంద్రయాన్ 1 ప్రాజెక్టు కూడా చేపట్టింది. ఈ మిషన్ జాబిల్లి కక్ష‍్యలో దాదాపు 3400 ఆర్బిట్‌లు తిరిగింది. 2009 ఆగష్టు 29న ఈ స్పేస్ క్రాఫ్ట్ కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత ఈ మిషన్ కూడా పూర్తయింది.
అయితే.. చంద్రయాన్ 1 ప్రయోగం లాంచింగ్‌కి అప్పట్లో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంని పిలిచారు. అక్కడకు హాజరైన ఆయన చంద్రయాన్ 1 మిషన్ శాస్త్రవేత్తల బృందానికి ఓ ప్రశ్న వేశారు. ప్రయోగం విజయవంతం అయిందనడానికి రుజువులు ఏం ఉంటాయని అడిగారు. అందుకు ఫొటోలు మాత్రమే అని శాస్త్రవేత్తలు తెలపగా.. అవి సరిపోవని అయన చెప్పారు. చంద్రునిపై ఏదైనా వస్తువు వేయాలని సూచించారు.
కలాం సూచనలు విన్న శాస్త్రవేత్తల బృందం.. ప్రయోగంలో మార్పులు చేసింది. ఆ తర్వాత చంద్రయాన్ 1 నుంచి టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా భూమి ఫొటోలను పంపించినప్పుడు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగ్గ విషయమని విలేఖరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రయోగం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే..
Comments
Please login to add a commentAdd a comment