
1..కరోనా కట్టడి.. జింగ్‌పిన్ తీవ్ర హెచ్చరికలు
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క చైనా మాత్రమే కరోనా కట్టడికి జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తోంది. అయితే.. ఆ అనుసరించే విధానం మరీ ఆరాచకంగా ఉండకపోవడమే సొంత పౌరుల నుంచే వ్యతిరేకతకు కారణం అవుతోంది. లాక్‌డౌన్‌తో నరకం అనుభవిస్తున్న వాళ్లు విజ్ఞప్తులు చేస్తున్నా.. కనికరించే ప్రసక్తే లేదంటున్నాడు చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2..వీడియో: భర్తతో వాగ్వాదం.. చిర్రెత్తుకొచ్చి వెంటపడి మరీ చితకబాదిన లాయర్
ఓ కేసులో మహిళ తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఓ న్యాయవాది ఆమెను వెంటపడి మరీ దాడి చేశాడు. భరణం కోసం ఓ మహిళ.. భర్త మీద కేసు వేయగా.. ఆ భర్త తరపు వాదిస్తున్న న్యాయవాది ఆమెను పరిగెత్తించి మరీ కోర్టు ప్రాంగణంలోనే చితకబాదాడు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో జరిగింది ఈ ఘటన.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3..మమ్మీ చేతిలో రిమోట్, డమ్మీ చేతిలో పాలన: రాహుల్‌కు కేటీఆర్ కౌంటర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాహుల్ ఏ హోదాలో తెలంగాణకు వచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఔట్‌డేటెడ్ పార్టీ అని, సొంత ప్రధాని తెచ్చిన ఆర్డినెన్స్‌ను గౌరవించలేని వ్యక్తి రాహుల్ అంటూ దుయ్యబట్టారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4.. వైఎస్సార్‌సీపీకి పొత్తు అవసరమే లేదు: విజయసాయిరెడ్డి
వైఎస్సార్‌సీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి. ఓటమి భయంతో.. ఎవరికైతే ప్రజల మద్దతు లేదనుకుంటున్నారో.. వాళ్లే పొత్తుల కోసం చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారాయన.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5.. మీడియాకు ఎక్కితే ఉపేక్షించం.. సొంత పార్టీ నేతలకు రాహుల్ వార్నింగ్
తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు కానీ, జన బలం లేదని విమర్శించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6.. అభిమానుల కోసం మహేశ్‌బాబు లేఖ, నెట్టింట వైరల్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన మాస్ ఎంటర్‌టైనర్ సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఈ క్రమంలో మహేశ్‌బాబు ఫ్యాన్స్ కోసం ఓ లేఖ వదిలాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7.. PBKS Vs RR: టాస్ ఓడిపోయాం.. పర్లేదు.. డే మ్యాచ్ కాబట్టి: సంజూ శాంసన్
ఐపీఎల్- 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కరుణ్ నాయర్ స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక శనివారం(మే 7) నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8..హెచ్‌డీఎఫ్‌సీ షాక్.. హోంలోన్లు ఇకపై భారం
దేశంలో హౌసింగ్ ఫైనాన్స్‌లో అతి పెద్ద బ్యాంకుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ హోంలోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచింది. ఇటీవల రెపోరేటును రిజర్వ్‌బ్యాంకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్‌పీఎల్‌ఆర్)ను 30 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9.. Summer Tips: అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ తీసుకుంటే!
చిన్నారులకు సెలవుల పండుగ వచ్చేసింది... టీచర్లకు కూడా కాస్త విరామం దొరికింది. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్లే ఈ సిసింద్రీలతో వేగేదెలాగా... అని తలలు పట్టుకుని కూచుంటున్నారు. ఇంతకీ వేసవి అంటే మండే ఎండలూ, వడగాడ్పులేనా?
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. నిత్య పెళ్లికొడుకు లీలలు.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి
మ్యాట్రిమోని ద్వారా ప్రకటనలు ఇస్తూ మహిళలను పరిచయం చేసుకుని ఒకరికి తెలియకుండా మరొక్కరిని ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకుని మరో మహిళను మోసం చేసిన అప్పలరాజు అలియాస్ విజయ్ బాగోతం తాజాగా బయటపడింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment