
1. Russia-Ukraine war: ప్రైవేట్ సైనికులు కావలెను.. రోజుకు వెయ్యి నుంచి 2వేల డాలర్ల జీతం, బోనస్ ప్రత్యేకం’
‘‘ఉక్రెయిన్ శిథిలాల్లో, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు ప్రైవేట్ సైనికులు కావలెను. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల జీతం. బోనస్ ప్రత్యేకం’’ – సైలెంట్ ప్రొఫెషనల్స్ అనే ప్రైవేట్ సైనిక సంస్థ ప్రకటన ఇది. కొన్నేళ్లుగా ఇలాంటి ప్రకటనలు వెబ్‌సైట్లలో అనేకం ప్రత్యక్షమవుతున్నాయి.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. భారత్‌పై సైబర్ దాడులు.. ఏకంగా 70 వెబ్‌సైట్లు హ్యాక్
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు భారత్‌కు భారీ చేటును తీసుకొచ్చాయి. తాజాగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్‌సైట్లను సైబర్ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ పోర్స్ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్ కోరడర్స్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!!
గోదావరిలో ఇసుక మేటలు వేస్తే!!... తొలగించకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన. పోనీ ఇసుకను తొలగిస్తుంటే!!... బంగారంలాంటి ఇసుకను కావాల్సిన వారికి కట్టబెట్టేసి తరలించేస్తున్నారంటూ ఆవేశం. మద్యం విక్రయాలు పెరిగితే!!... ఊరూరా మద్యం ఏరులై పారుతోందని, పేదల ఆరోగ్యాన్ని బలిపెడుతున్నారని ఆక్రందన. పోనీ... మద్యం విక్రయాలు తగ్గితే!!... ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని, రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని గగ్గోలు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4.తెలంగాణలో మోగిన బడిగంట.. ఉత్సాహంగా విద్యార్థుల బడిబాట
వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.కొత్త ఆశలు, క్రొంగొత్త ఆలోచనలతో నూతన విద్యా సంవత్సరంలోకి విద్యార్థులు అడుగుపెట్టారు. అందంగా ముస్తాబైన పాఠశాలలు పిల్లలకు స్వాగతం పలికాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. Free Crop Insurance: పంటకు పూచీ మాది.. రైతులకు అండగా ఏపీ సర్కార్
ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు అనునిత్యం ఆందోళనే. విత్తనం వేశాక మొలక రాకపోతే.. పూత, కాయ దశలో తెగుళ్లు ఆశిస్తే.. తీరా పంట చేతికందే దశలో ఏ వర్షానికో తడిసిపోతే.. ఇలా దినదిన గండంగా గడపాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. Russia-Ukraine war: మరో 4 నెలలు?
రష్యా తెర తీసిన అకారణ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. తమ అందమైన దేశంలో జరిపిన ప్రతి హత్యాకాండకూ, దాడికీ పుతిన్ పశ్చాత్తాపపడేలా చేసి తీరతామన్నారు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. Pakka Commercial: గోపీచంద్ అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది
‘‘నేను హీరోగా చేసిన ‘రణం’, ‘లౌక్యం’ చిత్రాల్లో మంచి కామెడీ ఉంది.. వీటికి ఓ మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ అయితే అదే ‘పక్కా కమర్షియల్’ చిత్రం. ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. Dwaine Pretorius: ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు
ప్రతీసారి మనకు కలిసిరాదు అని అంటుంటారు. అదే విషయం ప్రస్తుతం మనం చెప్పుకునే సందర్భానికి సరిగ్గా అతుకుతుంది. విషయంలోకి వెళితే.. కటక్ వేదికగా టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇక సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికి వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. ఐటీ 30 శాతం శ్లాబులో ఉన్న వారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మేలు
మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను పరంగా ప్రయోజనానికి తోడు మెరుగైన రాబడులకు మార్గం అవుతుంది. అత్యవసర నిధి ఎప్పుడూ మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళ.. బ్లేడుతో దాడి.. 118 కుట్లు
ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్‌లో జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి