తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నేత కె. శంకరనారాయణన్(89) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనార్యోగ కారణాలతో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం కేరళలో పాలక్కాడ్‌లోని తన నివాసంలో మృతిచెందారు.
కాగా, శంకరనారాయణన్.. మహారాష్ట్ర, నాగాలాండ్, జార్ఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. అలాగే, కేరళ శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్థిక, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సహా రాజకీయ రంగాలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు.
శంకరనారాయణన్ మృతి పట్ల కేరళ అసెంబ్లీ స్పీకర్ ఎంబీ రాజేష్ సంతాపం తెలుపుతూ.. రాష్ట్రం సీనియర్, ప్రముఖ రాజకీయ నేతను కోల్పోయిందని అన్నారు. "శంకరనారాయణ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన నాకు గురువు లాంటి వారు. 16 ఏళ్ల పాటు యూడీఎఫ్‌ని నడిపించారు. తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూడా శంకరనారాయణన్ అన్నింటిని సులభంగా, ఆదర్శప్రాయంగా ఎదుర్కొన్నారు" అని కాంగ్రెస్ నేత సతీశన్ అన్నారు.
ఇది కూడా చదవండి: మోదీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
Comments
Please login to add a commentAdd a comment