
కోల్‌కతా : కరోనా..సామన్యుల నుంచి ఎందరో ప్రముఖులను సైతం బలితీసుకుంటుంది. తాజాగా పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి శ్యామల్ చక్రవర్తి (76) గురువారం కన్నుమూసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతవారం కోవిడ్ కారణంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం వామపక్ష రాజకీయాల్లో తీరనిలోటని సీపీఎం ఎమ్మెల్యే సుజన్ చక్రవర్తి అన్నారు. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ముఖ్య నాయకుడిగా శ్యాముల్ పనిచేసినట్లు చెప్పారు. పార్టీకి ఆయన లేని లోటు తీర్చలేనిదని తెలిపారు. 1982 నుంచి 1996 వరకు శ్యామల్ చక్రవర్తి మూడు సార్లు మంత్రిగా , రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడిగానూ కూడా పనిచేశారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అబ్దుల్ మన్నన్ శ్యాముల్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'సైద్ధాంతికంగా ఇరువురి పార్టీలు వేరైనా ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉండేది. అంతేకాకుండా అందరితో స్నేహపూర్వంగా మెలిగేవారు. రాజకీయంగా నాకు చాలాసార్లు సలహాలు అందించాడు. ఆయన మరణం బెంగాల్ రాజకీయల్లో తీరని లోటు' అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment