పాట్నా: మన ఇంట్లో ఎవరైనా పరీక్ష రాసేందుకు వెళ్తున్నారంటే కుటుంబ సభ్యులు ఆల్ ది బెస్ట్ చెబుతారు. కానీ, ఇక్కడ ఓ బాలిక తాను పరీక్ష రాసేందుకు వెళ్తే గ్రామస్తులందరూ ఆమె వెనకే పరీక్షా కేంద్రం వరకు వెళ్లి ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ఆమె వెనక్కు తిరిగి.. తన గ్రామస్తులకు చేతులు ఊపుతూ అభివాదం చేసింది. ఆ సమయంలో బాలికను చూసిన ఆ గ్రామస్తులంతా ఆనందంతో తిరిగి అభివాదం చేశారు. ఈ వినూత్న ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. అధికారుల నిర్లక్ష్యంతో సీతామర్హి జిల్లాలోని డబ్ టోల్ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. 900 మంది దళిత జనాభా ఉన్న ఆ గ్రామంలో అందరూ కూలి పనులు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఏ ఒక్క అమ్మాయి కూడా పదో తరగతి వరకు చదవకపోవడం గమనార్హం. కానీ, కొందరు యువకులు డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు చేసే స్థాయికి చేరుకోలేకపోయారు. కాగా, ఇందిరా కుమారి అనే బాలిక ఇటీవలే మంచి మార్కులతో ప్రీ-బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్‌ఈబీ) ఆధ్వర్యంలో మెట్రిక్యులేషన్ పరీక్షకు అర్హత సాధించింది. దీంతో ఆ గ్రామం నుంచి ఈ పరీక్షకు అర‍్హత సాధించిన మొదటి బాలికగా ఇందిర నిలిచింది. కాగా, గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. చదువుకోవడం కోసం ఇందిరా ఎన్నో కష్టాలను అనుభవించిందన్నారు. కష్టాలతో పోరాడింది కానీ చదువును విడిడిపెట్టలేదన్నారు. ఇప్పుడు ఇందిర గ్రామంలోకి ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment