
మానవ సంబంధాలు చాలా చిత్రమైనవి..
ఎప్పుడు ఎలా ఏర్పడతాయో.. పెనవేసుకుపోతాయో...
విరిగి.. కరిగి పోతాయో అందరికీ అర్థమయ్యే విషయం కాదు..
కావాలంటే ఈ రీల్ చూడండి. ముంబై మహా నగరంలో ఓ వర్ధమాన నటి
చేసిన రీల్ ఇది. రోజూ ఎక్కే ట్రెయిన్‌లో తను..
తనతోపాటే అదే రైల్లో పాటలు పాడుతూ నాలుగు డబ్బులు కోరుకునే దివ్యాంగుడు!
కళ్లు లేని ఆ దివ్యాంగుడి పాటకు.. తన మాటను జత చేసింది..
ఇరువురూ తమదైన ప్రపంచాల్లో డ్యూయెట్ పాడారు..
చివరగా ఆ అంధుడి ముఖంపై ఓ చిరునవ్వు..
నీ గొంతు గుర్తు పట్టాను సుమా అని!
ఇదీ ఓ బంధమే. అపురూపమైంది!
ఇష్టమైన వారితో మన్పర్ధలొస్తే.. గొడవలు పడితే..
ఒక్కసారి చూసేయండి. అన్నీ మరచిపోతారు!
Comments
Please login to add a commentAdd a comment