మనం కొంచెం కష్టం వస్తే చాలు నాకే ఎందుకు ఇలా అనుకుంటాం. కుంగిపోయి దిగులుపడిపోతాం. ఛాలెంజ్‌గా తీసుకోం. పైగా ఈ కష్టం మనకు ఏమైన నేర్పుతుందా! లేక మనకు తెలియంది ఏదో చెబుతుందని అని పాజిటివ్‌గా అస్సలు ఆలోచించాం. మరికొంతమంది ఆత్మహత్యలకు వరకు వెళ్లిపోతారు. ఇంకొందరు నాబతుకింతే అన్నట్టుగా ఉండిపోయి ఏ తాగుడో లేక డ్రగ్స్‌కో బానిసైపోతారు.
కొందరే ఎలాంటి కష్టమైన సరే తెగువతో పోరాడాలనుకుంటారు. వారే ఏదో ఒకరోజు గొప్పస్థాయికి ఎదుగుతారు. ఒకవేళ అందుకోలేకపోయినా ఎందరికో స్ఫూర్తిని అయినా నింపుతారు. అలాంటి వారే ఈ ప్రపంచానికి కావాల్సింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక వ్యక్తి ఒక కాలు లేదు అయినా సరే మరో కాలితో తన జీవనాన్ని సాగిస్తున్నాడు. కుమిలిపోలేదు కాదుగదా అయ్యో! ఈ ఒంటి కాలితో ఏ పని చేయగలను అని కూడా అనుకోలేదు.
తన పొట్ట పోషించుకుని ఏదో విధంగా బతకాలని తపించాడు. బహుశా అదే అతని ఆత్మశక్తి కాబోలు. ఒక దివ్యాంగుడు ఒక చేతిలోని ఊతకర్ర సాయంతో మరో చేతితో రిక్షా లాగుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ సంఘటన ప్రేరణ ఇచ్చేలానే గాక ధైర్యంగా ఎలా బతకాలో నేర్పించే పాఠం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో బాస్ నీ గట్స్‌కి సెల్యూట్ అంటూ అతన్నిప్రశంసిస్తూ ట్వీట్ చేశారు చాలా మంది నెటిజన్లు.
जीना है गर कुछ प्रयास तो करना होगा
— Aamir Khan ₚₐᵣₒdy (@AamirKhanfa) January 17, 2023
स्वर्ग देखना है तो खुद को मारना होगाhttps://t.co/PwsFvru9b7 pic.twitter.com/PLzGJd3YdG
(చదవండి: ఎంజాయ్ చేద్దామని వెళ్తే ఊహించని షాక్.. పెండ్యులం రాడ్ విరగడంతో..)
Comments
Please login to add a commentAdd a comment