కోల్‌కతా: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాకా కొందరు తమ శరీరంలో అయస్కాంత లక్షణాలు కనిపిస్తున్నాయంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవలే నాసిక్‌కు చెందిన 71 ఏళ్ల అరవింద్ సోనార్ అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అతడి శరీరం అయస్కాంతంలా మారిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బెంగాల్‌కు చెందిన అనిమా నాస్కర్ (66)కు తన శరీరంలో అయస్కాంత లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు.
అనిమా ఇటీవలే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ''నా శరీరంపై మెటాలిక్ వస్తువులు అతుక్కుంటున్నాయి. దీంతో డౌట్ వచ్చి నా కొడుకు ప్రయోగాలు చేశాడని.. నాకు ఆయస్కాంత లక్షణాలు ఉన్నట్లు తేల్చాడు. నా శరీరంలో అయస్కాంత శక్తికి కరోనా వ్యాక్సిన్ అని మాత్రం చెప్పలేను. ఈ లక్షణాలు ఎందుకు ఉన్నాయనే దానిపై రిపోర్ట్ రావాల్సి ఉంది.అప్పటివరకు నా శరీరం ఇలా కావడానికి కరోనా వ్యాక్సిన్‌ను తప్పుబట్టను.''అని చెప్పుకొచ్చారు.
అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానిపై అనిమా తన కొడుకు సందీప్‌తో కలిసి అక్కడి లోకల్ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. ఆ రిపోర్ట్‌లో వచ్చే దానిపై అసలు విషయం బయటపడనుంది. '' నేను వ్యాక్సిన్‌ను తప్పుబట్టను. ముందుల వల్ల శరీరంలో జరిగే మార్పులే ఇలాంటి వాటికి కారణం అని నేను భావిస్తున్నా.'' అని సందీప్ తెలిపాడు. అయితే మీకు అయస్కాంత లక్షణాలు ఉండడం చూసి భయపెడుతున్నారా అని అనిమాను అడగ్గా.. '' నేనేం భయపడట్లేదు.. కానీ అయస్కాంత లక్షణాల వెనుక ఉన్న కారణం తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నా'' అంటూ నవ్వుతూ పేర్కొన్నారు.
చదవండి: Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు!
Comments
Please login to add a commentAdd a comment