అంత ఓవర్‌ ఎందుకు భయ్యా.. దెబ్బకు సరదా తీరిపోయిందిగా.. | Youth Fails Horribly While Trying Dangerous Scooty Stunt Video Viral | Sakshi
Sakshi News home page

అంత బలుపెందుకు భయ్యా.. దెబ్బకు సరదా తీరిపోయిందిగా..

Published Sun, Jan 1 2023 4:10 PM | Last Updated on Sun, Jan 1 2023 4:13 PM

Youth Fails Horribly While Trying Dangerous Scooty Stunt Video Viral - Sakshi

ప్రస్తుత జనరేషన్‌ యూత్‌లో కొందరు బైక్‌ రైడింగ్స్‌ చేస్తూ ప్రమాదాలకు గురైన ఘటనలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియోలు చూసే ఉంటారు. తమకే బైక్‌ రైడింగ్‌ తెలుసు అన్నట్టుగా రోడ్డుపై స్టంట్స్‌ చేసి ప్రమాదాలను కొనితెచ్చుకున్నారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. వీడియోలో ఓ యువకుడు రోడ్డుపై స్కూటీ డ్రైవ్‌ చేసుకుంటూ వస్తాడు. స్కూటీ ముందు ఉన్న మరో వ్యక్తి ఇదంతా వీడియో తీస్తూ ఉన్నాడు. కాగా, స్కూటీ డ్రైవ్‌ చేస్తున్న క్రమంలో యువకుడు.. ఒక్కసారిగా రన్నింగ్‌లో ఉన్న స్కూటీతో స్టంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తాడు. స్కూటీ స్పీడ్‌లో ఉండటంతో బైకర్‌ అదుపుతప్పి ముందుకుపడిపోయాడు. అనంతరం.. స్కూటీ కూడా అతడిపై పడిపోయింది. ఈ ఘటనలో సదరు యువకుడికి గాయాలు అయ్యాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మరోవైపు.. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా, ఆ వీడియో రోడ్డుపై ఓ బైకర్‌.. బైక్‌తో స్టంట్‌ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో స్పీడ్‌లో ఉన్న బైక్‌పై పట్టుకోల్పోవడంతో బైకర్‌ కింద పడిపోయాడు. కానీ, బైక్‌ మాత్రం స్పీడ్‌లో అలాగే ముందుకు సాగింది. ఇక, ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement