Zomato And Swiggy Down: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల రెండు యాప్స్ డౌన్ అయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ యాప్స్ పని చేయలేదు. సరిగ్గా లంచ్ సమయంలో యాప్స్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఫుడ్ ఆర్డర్ చేసేందుకు గంటపాటు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై పలువురు యూజర్స్ ట్విటర్ వేదికగా పోస్టు చేస్తున్నారు. చాలా మంది జొమాటో, స్విగ్గీ యాప్స్ పనిచేయడం లేదని, ఆర్డర్‌లు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. యాప్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వస్తున్న సమస్యలను స్క్రీన్ షాట్లు తీసి ట్విట్టర్లో షేర్ చేశారు.
ఫుడ్ ఆర్డర్లు బుక్ కాకపోవడంపై కస్టమర్ కేర్స్‌కు ఫిర్యాదు చేశారు. ‘అమెజాన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి ట్రాక్ చేస్తుండగా యాప్ క్రాష్ అయ్యింది. ఆర్డర్‌ను పొందలేకపోతున్నాను’ అని ఓ యూజర్ పేర్కొన్నారు. అయితే అమెజాన్ వెబ్ సర్వీస్ వల్ల రెండు యాప్‌లు క్రాష్ అయినట్లు భావిస్తున్నారు. కాగా ఈ విషయంపై స్విగ్గీ, జొమాటో రెండూ స్పందించాయి. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి జొమాటో, స్విగ్గీ క్షమాపణలు తెలిపాయి. తాము తాత్కాలికంగా సాంకేతికంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపాయి. తమ టీమ్ పనిచేస్తోందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నాయి.
How come @swiggy_in @SwiggyCares and @zomatocare stopped working at the same time 😭
— FriesBeforeGuys (blue tick) (@alltimefoodie24) April 6, 2022
Is Zomato down? In this economy?
— Sahil Rizwan (@SahilRiz) April 6, 2022
(Second time this is happening to me since yesterday btw)
Comments
Please login to add a commentAdd a comment