రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

Published Thu, Feb 20 2025 8:33 AM | Last Updated on Thu, Feb 20 2025 8:29 AM

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

కుంటాల: జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కుంటాల విజయసాయి పాఠశాలలో రాష్ట్రస్థాయి అండర్‌–16 కబడ్డీ పోటీలు ఈనెల 12 నుంచి నిర్వహించారు. పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో 12 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 20 నుంచి 23 వరకు వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి బర్కుంట సునీల్‌ పేర్కొన్నారు. ఎంపికై న జట్టును ప్రిన్సిపాల్‌ పంగెర స్వప్న సంతోష్‌, పీఈటీ రాథోడ్‌ అరవింద్‌, గ్రామ పెద్దలు దొనికెన వెంకటేశ్‌, తాటి శివ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement