‘బెంబర’లో చిరుత సంచారం
● భయం గుప్పిట్లో జనం ● పాదముద్రలు గుర్తించి కెమెరాలు అమర్చిన అధికారులు
తానూరు: మండలంలోని బెంబర అటవీ ప్రాతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బెంబర గ్రామానికి చెందిన రైతు చుక్కబోట్ల సాయిలు బుధవారం దినమంతా ఆవులను మేపి పొలంలో కట్టేసి రాత్రికి ఇంటికి అన్నం తినేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లేగదూడను చిరుత చంపి తిన్నది. గురువారం ఉద యం గమనించిన సాయిలు అటవీశాఖ అధికారుల కు సమాచారం ఇచ్చాడు. బీట్ అధికారి వేణుగోపా ల్ అక్కడికి చేరుకుని పాదముద్రలు పరిశీలించి చి రుత ఆనవాళ్లుగా గుర్తించారు. అటవీ ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా, బెంబర రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.
సిరాల శివారులోనూ..
భైంసారూరల్: మండలంలోని సిరాల శివారులో చిరుత సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం భైంసా ఎఫ్‌ఆర్వో శంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది సిరాలకు వెళ్లి వివరాలు సేకరించారు. గురువారం సాయంత్రం రైతు మహే శ్ గ్రామ శివారులోని తన మొక్కజొన్న చేనుకు నీటి తడి అందిస్తుండగా చిరుత కనిపించింది. భయపడ్డ అతడు ఊళ్లోకి వచ్చాడు. శుక్రవారం అధికారులు అతడితో చేను వద్దకు వెళ్లి చూడగా చిరుత పాదముద్రలు కనిపించాయి. పాదముద్రల కొలతలు తీసిన అటవీశాఖ అధికారులు చిరుతగా నిర్ధారించారు. సి రాల గుట్టల సమీపంలోనే చిరుతపులి ఉందన్న భ యం ఆ గ్రామ రైతులకు నిద్రలేకుండా చేస్తోంది. శు క్రవారం పంట చేల వద్దకు వెళ్లేందుకు వణికిపోయా రు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భైంసా ఎఫ్‌ఆర్వో శంకర్ సూచించారు.
‘బెంబర’లో చిరుత సంచారం
Comments
Please login to add a commentAdd a comment