బీజేపీ గెలుపునకు కృషి చేయాలి
భైంసాటౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఎంపీ గోడం నగేశ్, ఎ మ్మెల్యే రామారావు పటేల్ సూచించారు. శుక్రవా రం పట్టణంలోని ఎస్‌ఎస్ కాటన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ఓటర్లకు వి వరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. నాయకులు రాజేశ్‌బాబు, గంగాధర్, పడిపెల్లి గంగాధర్, గోపాల్‌సర్డా, సాయినాథ్, మల్లేశ్వర్ ఉన్నారు.
బీజేపీతోనే మార్పు..
కుంటాల: బీజేపీతోనే మార్పు సాధ్యమని ఎంపీ గో డం నగేశ్, ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నా రు. మండలంలోని కల్లూరు, కుంటాల గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడా రు. బీజేపీ బలపరిచిన పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మె ల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని కోరారు. ముధోల్ ఇన్‌చార్జి హరినాయక్, మాజీ ఎంపీపీ గజ్జారాం, నాయకులు సాయినాథ్, నారాయణరెడ్డి, వెంగల్‌రావు, అశోక్‌కుమార్, రమేశ్‌గౌడ్, గజేందర్, సాయి సూర్యవంశీ, శేఖర్‌రావు, నవీన్, రమణారావు, గోవర్ధన్ తదితరులున్నారు.
పట్టభద్రుల భవిష్యత్ కోసం..
ముధోల్: పట్టభద్రుల భవిష్యత్ కోసం బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యను గెలిపించాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక ల ప్రచారం నిర్వహించగా ఎంపీ పాల్గొని మాట్లాడా రు. కార్యకర్తలు పార్టీని గెలిపించేలా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీ మండలా ధ్యక్షుడు కోరి పోతన్న, జిల్లా కౌన్సిల్ సభ్యుడు భూమేశ్, ముధోల్ తాలూకా కన్వీనర్ సాయినాథ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మీనర్సాగౌడ్, నాయకులు సంతోష్, పోతన్న తదితరులున్నారు.
● ఎంపీ గోడం నగేశ్
Comments
Please login to add a commentAdd a comment