కార్మికుల సంక్షేమమే ధ్యేయం
నిర్మల్‌ఖిల్లా: భవననిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రవాసీ మిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో వీరి కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను ప్రా రంభించి మాట్లాడారు. జిల్లాలో భవన నిర్మాణ రంగంలో వేలాదిమంది పని చేస్తున్నా సంక్షేమ బోర్డులో సభ్యత్వానికి నోచుకోలేకపోవడం బాధాకరన్నా రు. గ్రామీణ కార్మికులు పంచాయతీ కార్యదర్శుల ధ్రువీకరణ, పట్టణ ప్రాంత కార్మికులకు వార్డు అ ధి కారుల ధ్రువీకరణపత్రాల సేకరణలో ఆసక్తి చూ ప డం లేదని తెలిపారు. ఆన్‌లైన్ నమోదుకు సర్వర్ జాప్యం సమస్య ఏర్పడుతోందని, ఈ నేపథ్యంలో తమ సంఘం తరఫున తగిన సహాయ సహకారాలు అందించి తాము కార్మికులుగా పేర్లు నమోదు చేస్తున్నామని చెప్పారు. కార్మిక శాఖ తరఫున జిల్లాలో స హాయ కార్మిక అధికారులుగా నిర్మల్, భైంసా ప్రాంతాల్లో ఇన్‌చార్జీలు ఉండడంతో కార్డుల జారీ, క్లెయిమ్‌ల పరిష్కారంలో ఏళ్లపాటు జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఇందుకోసం కార్యాలయాల చు ట్టూ తిరగలేక కార్మికులు విసిగిపోతున్నట్లు తమ సంఘం దృష్టికి వచ్చిందన్నారు. ప్రతీ భవన నిర్మాణరంగ కార్మికుడు ఈ–శ్రమ్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యత్వం ఉంటే ప్రమాద బీమా, వివా హ, ప్రసవ సమయాల్లో ప్రభుత్వం అందించే నగ దు తదితర పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చని పే ర్కొన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులు తమ కా ర్యాలయాన్ని గాని లేదా హెల్ప్ డెస్క్‌ను 82475 11415 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. భవన నిర్మాణ సంఘం సొసైటీ అధ్యక్షుడు మోహ న్, కార్యాలయ సమన్వయకర్త గీత, కార్మిక సంఘా ల నాయకులు లావణ్య, బాలయ్య, లక్ష్మీనారాయణ, భాషా, షేక్ హకీం, డేవిడ్, స్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment