నిర్మల్
పుస్తకరాజం
పుస్తకం హస్తభూషణం అనేవారు అయితే ప్రస్తుతం సెల్‌ఫోన్ హస్తభూషణంగా మారింది. కానీ ఇప్పటికీ కొందరు గ్రంథాలయాల్లో పుస్తకాలతో విజ్ఞానాన్ని పొందుతున్నారు.
ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సీఎంను కలిసిన కోనప్ప
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి హైదరాబాద్‌లో సీఎంతో భేటీ అయ్యారు. సిర్పూర్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులు రద్దు చేయడం, స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని కోనప్ప ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని కాదని బీఎస్పీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. కాగజ్‌నగర్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హాజరైన సమావేశానికి దూరంగా ఉండడంతో కోనప్ప కాంగ్రెస్‌ను వీడుతారనే సంకేతాలు వెళ్లాయి. సీఎంను కలిసిన తర్వాత పార్టీలోనే కొనసాగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి పనుల పెండింగ్‌పై సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
నిర్మల్‌చైన్‌గేట్: ఎల్‌ఆర్‌ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఈ ప్రకటనతో దరఖాస్తుదారులు ముందుకొస్తారని భావిస్తుండగా.. భారీగా పేరుకుపోయిన దరఖాస్తుల పరిశీలన అరకొరగా ఉన్న సిబ్బందికి భారంగా మారుతోంది. ఈఏడాది మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తయితే 25 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేరు. దీంతో పరిశీలన పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫీజు చెల్లించింది 51 మందే..
మూడు మున్సిపాలిటీల పరిధిలో 26,726 మంది, గ్రామీణ ప్రాంతంలో 19,286 మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇందులో మున్సిపాలిటీల పరిధిలో మూడు నెలల వ్యవధిలో అధికారులు దరఖాస్తులను పరిశీలించి 2,695 దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. కానీ అందులో కేవలం 50 మంది మాత్రమే ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నారు. ఇంకా 2,645 మంది ముందుకు రాలేదు. అలాగే గ్రామీణ ప్రాంతంలోని 18 మండలాల పరిధిలో 17,949 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఒక్కరు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఒక్కో దశ దాటితేనే..
తొలుత సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆపై మొబైల్ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో రెవెన్యూ, గ్రామం లేదా మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన బృందం పరిశీలన చేపట్టాలి. ఈ బృందం జీపీఎస్ ద్వారా సదరు భూమి హద్దులు, ఇతర సమాచారాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంది. అదే సమయాన భూములు నీటి వనరుల బఫర్‌జోన్, నాలా, చెరువులు, డిఫెన్స్ ల్యాండ్ పరిధిలో లేవని ధ్రువీకరించాలి. ఇదంతా మూడు దశల్లో జరగాల్సి ఉన్నా చాలా సమయం పడుతోంది.
రూ.కోట్లలో ఆదాయం..
2001లో ఎస్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. అయితే ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున ప్రాథమిక రుసుము వసూలు చేశారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అదే తరహాలో మిగతా మొత్తం చెల్లించేలా చేసి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఎస్‌ఆర్‌ఎస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
వేగవంతం కానున్న ప్రక్రియ..!
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వేగవంతం అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇవ్వడంతో, ఆలోగా పూర్తిస్థాయిలో దరఖాస్తులు పరిశీలించటం సాధ్యమవుతుందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లను మూడు శాఖల అధికారులు పరిశీలించిన తర్వాతే క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 40 రోజుల గడువు మాత్రమే ఉండటంతో దరఖాస్తుదారులు ముందుకు వస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసి, స్పెషల్ డ్రైవ్ చేపట్టే యంత్రాంగం ప్రస్తుతం అందుబాటులో లేదని తెలుస్తోంది.
న్యూస్‌రీల్
సీఎం సమావేశ స్థలం మార్పు
నిర్మల్‌చైన్‌గేట్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో పట్టభద్రులతో నిర్వహించే సమావేశ స్థలం మార్చినట్లు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు తెలిపారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని సాగర్ కన్వెన్షన్ హాల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హాజరవుతారని తెలిపారు. పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరై సీఎం సమావేశం విజయవంతం చేయాలని కోరారు.
క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ మార్చి 31 వరకు గడువు జిల్లావ్యాప్తంగా 44,970 దరఖాస్తులు ఇప్పటివరకు ఫీజు చెల్లించింది51 మందే..
మొత్తం వచ్చిన దరఖాస్తులు 44,970
ప్లాట్లు 44,436
లేఅవుట్లు 534
మండలాల వారీగా దరఖాస్తులు
మండలం ప్లాట్లు లేఅవుట్లు
బాసర 2,598 36
భైంసా 1,578 15
దస్తూరాబాద్ 6 0
దిలావర్‌పూర్ 171 10
కడెం 77 1
ఖానాపూర్ 1,648 27
కుభీర్ 621 9
కుంటాల 372 13
లక్ష్మణచాం 269 11
లోకేశ్వరం 319 9
మామడ 59 3
ముధోల్ 622 8
నర్సాపూర్(జి) 218 5
నిర్మల్ రూరల్ 5,596 94
పెంబి 65 4
సారంగాపూర్ 1,985 30
సోన్ 1,588 15
తానూర్ 157 5
ఊరట నిచ్చేలా రాయితీ..
ఏళ్లుగా పెండింగ్ ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ దరఖాస్తుదారులకు కలిసొస్తుంది. ఒక ప్లాట్‌కు సంబంధించి రోడ్లు, పైపులైన్లు, ఇతర సౌకర్యాలు లేకుండా ఏర్పాటుచేసినందుకు ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు విధిస్తుంటారు, వీటితోపాటు గ్రీన్ ల్యాండ్‌కు 10 శాతం స్థలాన్ని ఇవ్వనందుకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం విలువను లెక్కించి దానిపై 14 శాతం చార్జి విధిస్తారు. ఈ రెండూ చెల్లిస్తేనే యజమానికి స్థలం రెగ్యులరైజ్ అవుతుంది. మొత్తంగా రాయితీతో దరఖాస్తుదారులకు ముందుకొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇదే సమయాన అదనపు సిబ్బందిని కేటాయించాలనే సూచనలు వస్తున్నాయి.
ఈనెల 21వ తేదీ వరకు మున్సిపాలిటీల వారీగా
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు..
మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు అనుమతి ఫీజు చెల్లించినవి
పొందినవి
ఖానాపూర్ 1,928 8 8
నిర్మల్ 15,515 2,100 42
భైంసా 9,044 587 0
నిర్మల్
నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment