నేడు మంచిర్యాలకు సీఎం
సాక్షి ప్రతినిధి మంచిర్యాల: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మంచిర్యాలకు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలిక్యాప్టర్‌లో బయలు దేరుతారు. 11.45 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుని అక్కడ 11.50 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి 2.15 గంటలకు మంచిర్యాలకు వచ్చి 2.20 నుంచి 3.55 వరకు సభకు హాజరవుతారు. సీఎంతోపాటు మంత్రులు, రాష్ట్రస్థాయి నాయకులు సభకు హాజరుకానున్నారు. ఈ సభకు 12వేల మంది పట్టభద్రులను తరలించేలా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు సమీప ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పట్టభద్రులను సభకు రప్పించే ఏర్పాట్లు చేశారు. సీఎం సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. డీసీపీ భాస్కర్ నేతృత్వంలో సభాస్థలి, పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నేటి నిర్మల్ పర్యటన రద్దు
నిర్మల్‌టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్మల్ పర్యటన రద్దయినట్లు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ శ్రేణులు గమనించాలని సూచించారు.
అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు పొరు గు జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆలయ ఈవో రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment