ఘనంగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ
సోన్: మండల కేంద్రంలోని రాజరాజేశ్వరస్వామి, లోకల్ వెల్మల్ గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ధ్వజ, శిఖర, ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల వద్ద ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. బీజేపీ మండలాధ్యక్షుడు మారా గంగారెడ్డి, నాయకులు సరికెల గంగన్న, జక్క రాజేశ్వర్, నరేశ్, నర్సారెడ్డి, నర్సయ్య, సంతోష్, ప్రశాంత్, గంగన్న, సాయన్న, మక్కన్న, అమృత్, రాజు, ఉదయ్, శివ భక్తులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
ధర్మోర హన్మాన్ ఆలయంలో..
లోకేశ్వరం: మండలంలోని ధర్మోర గ్రామంలో నూతనంగా నిర్మించిన హనూమాన్ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావుపటేల్ హాజరై పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. నాయకులు సాయన్న, మెండె శ్రీధర్, మంద భాస్కర్, మంద గణేశ్, జయసాగర్‌రావు, అనిల్, ఆజోబ పటేల్, ఉత్సవ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ
Comments
Please login to add a commentAdd a comment