
మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ
నిర్మల్‌ఖిల్లా: ఖేలో ఇండియా సౌత్ జోన్ మార్షల్ ఆర్ట్స్(వూషూ) ఎంపిక పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఈనెల 18, 19 తేదీల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రి యదర్శిని స్టేడియంలో ఖేలో ఇండియా ఉమె న్స్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో నిర్మల్ జిల్లా నుంచి 39 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. 5 బంగా రు, 2 రజత, 8 కాంస్య పతకాలు సాధించా రు. లోలం మమత –కేజీబీవీ(భైంసా), జి.నక్షత్ర–కేజీబీవీ(భైంసా), జే.ఈశ్వరి–జెడ్పీహెచ్‌ఎస్(పార్డీ–బీ), జే.గౌరీబాయి–ఎడ్‌బిడ్ తండా, ఎస్.భాగ్యలక్ష్మి–భైంసా బంగారు పతకా లు సాధించారు. శృతి, ప్రణతి రజత పతకా లు, మైథిలి, కౌశర్, వైష్ణవి, సోనిబాయి, స్వాతి, శైలజ, షేక్‌జోయా, కృషిక కాంస్య పతకాలు సాధించారు. వీరంతా త్వరలో తమిళనాడులో నిర్వహించే సౌత్‌జోన్ ఖేలో ఇండియా ఉమెన్స్ వూషూ పోటీల్లో పాల్గొంటారని కోచ్ శ్రీరాముల సాయికృష్ణ తెలిపా రు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, ఖేలో ఇండియా వూషూ కోచ్ జ్ఞానతేజ, మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు తేజేందర్‌సింగ్ భాటియా, శ్రీకాంత్, శివరాజ్‌గౌడ్, భూషణ్, మృణళిని, సాయినాథ్, రాజ శ్రీ, ప్రతిక్ష, చిరంజీవి, వంశీ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment