
పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి
– ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి వూటుకూరి
తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి వూటుకూరి అన్నారు. ఎన్నికల్లో ఓటరు నమోదు చేసుకున్న వారందరికీ ఉచితంగా రూ.3 లక్షల ప్రమాద బీమా కల్పిస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థలో పని చేస్తున్న గ్రాడ్యుయేట్లకు ప్రమోషన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న టీచర్లకు కనీస వేతనం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ తీసుకువచ్చే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు. ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా ఉండి వారి సమస్యలన్నీ పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment