ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటి ష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలి పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకీషర్మిలతో కలిసి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 19,107 మంది ఓటు హక్కు పొందారని ఇందులో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉ న్నారని వివరించారు. ఓటరు గుర్తింపు స్లిప్పుల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. ఓటర్లకు ఆర్డీవో కార్యాలయంలో సోమ, మంగళవారం అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ సంఘాల వారికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు మాస్టర్ ట్రైనర్లతో రెండుసార్లు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు.
పటిష్ట భద్రత..
ఎన్నికల నిర్వహణను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన ట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి రూ.38,06,830 నగదు, రూ.3,03,000 విలువ గల 827 లీటర్ల మద్యాన్ని, రూ.5,750 విలువ చేసే నిషే ధిత మత్తు పదార్థాలు, పీడీఎస్ బియ్యం, గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్‌రెడ్డి, సిరికొండ రమేశ్, గండ్రత్ రమేశ్, హైదర్, మజార్, జగన్‌మోహన్, అధికారులు పాల్గొన్నారు.
టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభిన వ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియెట్, పదో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాకు చేరుకున్న పరీక్షల సామగ్రికి సంబంధించిన వివరా ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 6,571 మంది ప్రథమ సంవత్స రం, 6,562 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. మార్చి 5 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయ ని వెల్లడించారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేయాల ని అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయన్నారు. పరీక్ష, జవాబు పత్రాల తరలింపు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల ని సూచించారు. జిల్లాకు చేరుకున్న పరీక్షల సామగ్రి ని నిర్దేశిత ప్రదేశాల్లో జాగ్రత్తగా భద్రపరచాలన్నా రు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించా లన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇతర అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూ చించారు. పరీక్ష జరుగుతున్నంతసేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవా లన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సమయాని కి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధి కారులు ప్రత్యేక బస్సులు నడపాలని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరుశురాం, డీఈవో పి.రామారావు, డీఎంహెచ్‌వో రాజేందర్, విద్యుత్ అధికారి వెంకటేశ్వర్లు, పోస్ట్‌మాస్టర్ వెంకటరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment