
పార్డి(బి)లో జాతర
కుభీర్: మండలంలోని పార్డి(బి) రాజరాజేశ్వర మందిరం మహాశివరాత్రి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. బుధవారం మందిరంలో పూజలు, అభిషేకాలు జరుగుతాయి. గురువారం దేవతా మూర్తులకు జోడువాగులో స్నానం చేయిస్తారు. అదేరోజు రాత్రి కళ్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం అంబళ్లు గ్రామంలోని మహిళలందరూ అంబళ్ల బుడ్లతో వచ్చి దేవునికి నైవేద్యం సమర్పిస్తారు. ఆదివారం కుస్తీపోటీలు జరుగుతాయి.
పార్వతీల వ్యవస్థ..
గతంలో భక్తులు తమ కూతుళ్లకు దేవునితో పెళ్లి చేసి అక్కడే వదిలిపెట్టేవారు. పార్వతిగా ఉన్న మహిళ దేవుని సేవచేస్తూ భక్తులకు మార్గదర్శనం చేసేవారు. ఆమె చనిపోతే అక్కడే సమాధి చేసేవారు. ఇక్కడ ఆరుగురు మహిళలు పార్వతిలుగా మారి చనిపోయారు. చివరి పార్వతమ్మ 2011లో చనిపోయింది. ఆ తరువాత పార్వతమ్మగా ఎవరూ మారలేదు.
Comments
Please login to add a commentAdd a comment