
నేడు రథాలగుడిలో పల్లకియాత్ర
నిర్మల్: జిల్లా కేంద్రంలోని చారిత్రక రథాలగుడిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పల్లకియాత్ర నిర్వహించనున్నట్లు వంశపారంపర్య పూజారులు తెలిపారు. కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఉత్సవ విగ్రహాలతో సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతీ మహాశివరాత్రికి నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
బ్రహ్మపురి రథాలగుడిలో కొలువైన విశ్వేశ్వరుడు
Comments
Please login to add a commentAdd a comment