
జాతరకు సిద్ధమైన మహాదేవుడు
లక్ష్మణచాంద: బాబాపూర్ గ్రామంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం మహాదేవుని జాతరకు సిద్ధమైంది. రెండవ వేములవాడగా బాబాపూర్ రాజేశ్వరుడు ప్రసిద్ధిగాంచాడు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బాబాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్దకు బుధవారం జిల్లాలోని వివిధ మండలాల ఉండి వేలాది మంది భక్తులు వచ్చి ఉపవాస దీక్షలు స్వీకరిస్తారు. రాత్రంతా జాగరణ చేస్తారు. బాబాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలసిన శివలింగం ఉంది. దీంతో ఇక్కడకు వచ్చి పూజలు చేస్తే తాము కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
కోడెలు సమర్పించడం ప్రత్యేకత...
వేములవాడ తర్వాత బాబాపూర్ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు కోడెలు సమర్పిస్తారు. సామి కోర్కెలు తీరిస్తే కోడెను సమర్పిస్తామని మొక్కుకుని ఇలా చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment