నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో అన్నిరకాల పన్నుల వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు పూర్తి చేసిన పన్నుల వివరాలు మున్సిపాలిటీల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెడ్ నోటీసులు జారీ చేసిన వారి వివరాలపై ఆరా తీశారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలలో వాణిజ్య, నీటి, వ్యాపార ప్రకటనల పన్నుల వసూలు వందశాతం పూర్తి చేయాలన్నారు. ఎక్కువ మొత్తంలో పన్నులు కట్టకుండా ఉన్నవారి జాబితా ను సిద్ధం చేసి, అందులోని మొదటి వంద మందికి రెడ్ నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ వాణిజ్య సముదాయాల అద్దెలు వసూలు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, రాజేశ్‌కుమార్, నిర్మల్ మున్సిపల్ డీఈ హరిభువన్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment