పాపహరేశ్వరుని దర్శనం... సర్వపాపహరణం
దిలావర్‌ఫూర్: సహ్యాద్రిపర్వత శ్రేణుల్లోని ‘కదిలి’ లోయలో కొలువుదీరి ఉన్న శ్రీమాతాన్నపూర్ణ సహిత పాపహరేశ్వరాలయాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు హరించబడతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మాడేగాం గ్రామ పంచాయతీ పరిధిలోని కదిలి గ్రామ పరిసర అటవీప్రాంతంలో వెలిసిందే శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వరాలయం. సహ్యాద్రి కొండల్లో మాతృహత్యాపాపం నుంచి విముక్తి పొందేందుకు పరశురాముడు ఇక్కడ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడని ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రకృతి అందాల నడుమ వెలసిన పాపహరేశ్వర స్వామి చెంతనే శ్రీమాతన్నపూర్ణేశ్వరీదేవి వెలిసింది.
కదిలె శివలింగం..
గర్భగుడిలోని శివలింగం భక్తితో పరిశీలిస్తే కదులు తున్నట్లు కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఒకే కాండంలో 18 వృక్షాలు మిలితమైన వట వృక్షం అత్తకోడళ్ళ గుండాలు, సీతమ్మ అల్లుబండ, అన్నపూర్ణమాత, ఆలయ ద్వారపాలకులు సప్త రుషుల ధ్యాన మందిరం, నందీశ్వరుడు, ఆవునోటి ద్వారా కోనేరులో చేరే నీరు వంటి వి ఇచ్చట భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
పాపహరేశ్వరుని దర్శనం... సర్వపాపహరణం
Comments
Please login to add a commentAdd a comment