ఖేలో ఇండియా పోటీలకు జిల్లా విద్యార్థి
భైంసాటౌన్: అఖిల భారత ఖేలో ఇండియా యోగా పోటీలకు తెలంగాణ నుంచి జిల్లా విద్యార్థి వార్లే దిలీప్ ఎంపికై నట్లు యోగా గురువు మల్లేశ్ తెలిపారు. తానూర్ మండలం హిప్నెల్లికి చెందిన దిలీప్ బెంగళూరులోని వ్యాస యూనివర్సిటీలో బీఎస్సీ యోగా చేస్తున్నారు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన యోగా పోటీల్లో యూనివర్సిటీ తరఫున పాల్గొని ప్రతిభ కనబర్చాడు. దీంతో మార్చిలో జమ్మూలో జరిగే ఖేలో ఇండియా జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగాతోపాటు, ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment