గొడిసిర్యాల రాజన్న...
దస్తురాబాద్: కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా గోడిసిర్యాల రాజన్న భక్తుల విశేష పూజలు అందుకుంటున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయం ముస్తాభైంది. ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన రాత్రి శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 27న కుంకుమ పూజలు, సాముహిక హోమం, 28న అన్నపూజ, మల్లన్న, పోచమ్మ బోనాలు నిర్వహిస్తారు. గోడిసిర్యాల రాజన్న ఆలయంలో అర్ధరాత్రి 12 గంటలకు లింగద్బోవం సమయంలో నాగుపాము దర్శనం భక్తులకు ప్రత్యేక ఆకర్షణ. ఇక గోడిసిర్యాల రాజన్న ఆలయంలో ముడుపు కట్టివెళ్తే కోరిక తీరుతుందని భక్తుల ప్రాగాఢ విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని రావి, మేడి, మామిడి చెట్లు భక్తుల ముడుపులతో నిండి పోతాయి.
గొడిసిర్యాల రాజన్న...
Comments
Please login to add a commentAdd a comment