ఏసీబీకి చిక్కిన ఎకై ్సజ్ ఎస్సై, కానిస్టేబుల్
● రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం..
భైంసాటౌన్: లంచం తీసుకుంటూ ఓ ఎకై ్సజ్ ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన ఘటన భైంసా ఎకై ్సజ్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి... భైంసా మండలం కామోల్‌కు చెందిన సుభాష్‌గౌడ్ అనే కల్లు వ్యాపారికి, అదే గ్రామానికి చెందిన మరో కల్లు వ్యాపారికి కల్లు విక్రయాల విషయమై గొడవ తలెత్తింది. దీంతో ఈ విషయం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. ఈ క్రమంలో సమస్య పరిష్కరించాలని సుభాష్‌గౌడ్ ఎకై ్సజ్ ఎస్సై నిర్మలను సంప్రదించాడు. ఆమె కానిస్టేబుల్ సుజాత ద్వారా రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీంతో సుభాష్‌గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పథకం ప్రకారం కానిస్టేబుల్ సుజాతకు డబ్బు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు విజయ్‌కుమార్, రమణమూర్తి, సీఐలు కిరణ్, స్వామి, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment