ఓలాదీశ్వరుని ప్రత్యేకత..!
కుంటాల: మండలంలోని ఓలా, దౌనెల్లి శివాలయం, సూర్యాపూర్ శ్రీరాజరాజేశ్వరాలయం, కుంటాల ఉమామహేశ్వర, మహాదేవుడు, ఆత్మలింగ ఆలయాలను ముస్తాబు చేశారు. ఓలా గ్రామంలో 150 ఏళ్ల క్రితం రాతి కట్టడంతో శివాలయాన్ని నిర్మించారు. ఆలయంలో లింగమూర్తిని ప్రతిష్టించారు. ఆలయం గర్భగుడి నుంచి సొరంగం మార్గం ఉందని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడి నుంచి బాసరలోని గోదావరి, కాశీకి వెళ్లి మునులు స్నానం ఆచరించేవారని చెబుతారు. సూర్యాపూర్ రాజరాజేశ్వరుడు మహారాష్ట్రలో సరిహద్దు ప్రాంతంలో వాగు, చెరువు సమీపాన కొలువుదీరి ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment