పెద్దల సభలో..మనోళ్లు
● ఉమ్మడి జిల్లా నుంచి శాసన మండలికి పలువురి ప్రాతినిధ్యం ● చైర్మన్‌గా ఆదిలాబాద్‌కు చెందిన సయ్యద్ ముకషీర్ షా ● పి.నర్సారెడ్డి, జీవీ సుధాకర్‌రావు, పలువురు ఎమ్మెల్సీగా ● స్థానికసంస్థలు, ఎమ్మెల్యే కోటాలోనే అవకాశాలు
సాక్షి,ఆదిలాబాద్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల, టీచర్స్ శాసనమండలి సభ్యుల ఎన్నికల వేడి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటు పట్టభద్రుల పరంగా, అటు టీచర్స్ పరంగా ఒకరంటే ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. పలువురు పోటీ చేసినప్పటికీ నిరాధారణకు గురయ్యారు. అయితే శాసనమండలి పరంగా ఉమ్మడి జిల్లాలో ఘన చరిత్ర ఉంది. ఆదిలాబాద్‌కు చెందిన సయ్యద్ ముకషీర్‌షా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలికి 6వ చైర్మన్‌గా వ్యవహరించారు. రెండుసార్లు ఆయన చైర్మన్‌గా ఉండటం గమనార్హం. ఆ సమయంలో మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి, కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్‌రావు సీఎంలుగా ఉన్నారు.
మనోళ్లు ముఖ్య పదవుల్లో..
ఉమ్మడి జిల్లా నుంచి శాసనమండలి చైర్మన్‌గా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ ముకషీర్ షా వ్యవహరించిన ఘనత ఉంది. కాంగ్రెస్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఒక్కసారి ఎన్నిక చేయగా, మరోసారి శాసన పరిషత్‌కు నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి 1958లో ఏర్పాటు కాగా, సీఎంగా వ్యవహరించిన ఎన్టీ రామారావు ఈ శాసనమండలి వ్యవస్థను 1985లో రద్దు చేశారు. అప్పుడు మండలి చివరి చైర్మన్‌గా ముకషీర్ షా ఉన్నారు. ఆ తర్వాత 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో మళ్లీ శాసనమండలి పునరుద్ధరించారు. నిర్మల్‌కు చెందిన పి.నర్సారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఎంపీ అయ్యారు. అప్పట్లో ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. దండేపల్లికి చెందిన జీవీ సుధాకర్‌రావు ఒకసారి ఎమ్మెల్సీగా వ్యవహరించారు. అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.
స్థానిక సంస్థల నుంచే..
ఉమ్మడి జిల్లా స్థానికసంస్థల నుంచే జిల్లా ముగ్గురు నేతలకు అవకాశం దక్కింది. అందులో కాంగ్రెస్ నుంచి సయ్యద్ ముకషీర్ షా, ప్రేమ్‌సాగర్‌రావులు ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరించిన పురాణం సతీశ్ పదవీ కాలం పూర్తయ్యే వరకు పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హస్తం పార్టీలో చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన దండే విఠల్ ఇప్పటికీ పదవిలో కొనసాగుతుండగా ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీలు
1.సయ్యద్ ముకషీర్ షా(మృతిచెందారు). 1979–80, 1981–85 (మండలి చైర్మన్), (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు
2.పి.నర్సారెడ్డి (మృతిచెందారు). మూడుసార్లు ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి, ఆ తర్వాత 1981–85 వరకు ఎమ్మెల్సీగా, ఒకసారి ఎంపీగా వ్యవహరించారు.
3.జీవీ సుధాకర్‌రావు (మృతిచెందారు). 1977 (పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు).
4.మహ్మద్ సుల్తాన్ అహ్మద్ (మృతిచెందారు), 2007–09 (ఎమ్మెల్యే కోటా నుంచి ప్రాతినిధ్యం వహించారు)
5. ప్రేమ్‌సాగర్‌రావు, 2007–13 (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.
6. పొగాకు యాదగిరి (మృతిచెందారు). 2007 (ఎమ్మెల్యే కోటా నుంచి ప్రాతినిధ్యం వహించారు)
7. పురాణం సతీశ్, 2015–22 వరకు (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం)
8. దండే విఠల్.. 2022 నుంచి 2028 వరకు కొనసాగనున్నారు. ‘స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం).
ఎమ్మెల్యే కోటాలో..
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెన్నూర్‌కు చెందిన సుల్తాన్ అహ్మద్‌ను మెనార్టీ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అంతకుముందు 1999లో ఈయన సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో మళ్లీ టికెట్ ఆశించారు. ఆ సమయంలో కోనేరు కోనప్పకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వగా, సుల్తాన్ అహ్మద్‌కు నామినేట్ పదవి విషయంలో భరోసానిచ్చారు. ఈమేరకే అప్పట్లో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. మంచిర్యాలకు చెందిన పొగాకు యాదగిరి న్యాయవాదిగా వ్యవహరించేవారు. ఎన్టీ రామారావు హయాం నుంచి టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వీరిద్దరు మినహా ఎవరు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించలేదు.
పెద్దల సభలో..మనోళ్లు
పెద్దల సభలో..మనోళ్లు
పెద్దల సభలో..మనోళ్లు
పెద్దల సభలో..మనోళ్లు
పెద్దల సభలో..మనోళ్లు
పెద్దల సభలో..మనోళ్లు
పెద్దల సభలో..మనోళ్లు
పెద్దల సభలో..మనోళ్లు
Comments
Please login to add a commentAdd a comment