ఆగస్త్యకూడం అధిరోహించిన చెన్నూర్ యువకుడు
చెన్నూర్: పట్టణానికి చెందిన యువకుడు మంచాల సూరజ్.. ఆగస్త్యకూడం
(శిఖరం) అధిరోహించాడు.మంచాల రాజబాపు– పద్మజ దంపతుల కుమారుడు సూరజ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన కేరళలోని తిరువనంతపురానికి 60 కి.మీ దూరంలో ఆగస్త్యకూడం(శిఖరం) 50 మీటర్ల ఎత్తును మూడురోజుల్లో ట్రెక్కింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ ట్రెక్కింగ్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. శిఖరానికి ఆగస్త్య మహాముని పేరు పెట్టడంతో ఇది ప్రసిద్ధి చెందిన తీర్థయాత్రగా పేరొంది. యాత్ర చేపట్టేవారికి కేరళ ప్రభుత్వం ఆహార సదుపాయాలు కల్పిస్తోంది. ట్రెక్కింగ్ విజయవంతంగా పూర్తి చేసిన సూరజ్‌ను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment