చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లో చికిత్స పొందుతూ మహారాష్ట్రకు చెందిన యువకుడు మంగళవారం మృతిచెందినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యవత్మాల్ జిల్లాలోని ధగడ్‌లాల్ గ్రామానికి చెందిన సట్పుటే దత్తు (22) గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తితో ఉమర్‌ఖేడ్ తాలుకాలోని కొర్ట గ్రామంలో బంధువుల పంట చేనులో ఈనెల 22న పురుగుల మందు తాగాడు. గమనించిన బంధువులు అతన్ని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు.
చోరీకి పాల్పడ్డ దొంగ అరెస్టు
ఆదిలాబాద్‌టౌన్: ఇటీవల చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌లో ఈనెల 8న తుమ్మల విజయ ఇంట్లో చోరీ జరిగింది. రూ.5వేల నగదు అపహరణకు గురైంది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని నేతాజీ చౌక్‌లో మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ తబ్రేజ్‌ను విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
ఇంట్లో చోరీ
తానూరు: మండలంలోని భోసి గ్రామంలో చాదల దత్తాత్రి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. సోమవారం రాత్రి దత్తాత్రి ఇంట్లో నిద్రించాడు. భార్య గోదావరి మరో గదికి తాళం వేసి గ్రామంలో నిర్వహించిన భజన కార్యక్రమానికి వెళ్లి మంగళవారం వేకువజామున వచ్చింది. గదికి వేసిన తాళం పగిలిపోయి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా తాళం, గల్లగురిగి ధ్వంసమై కనిపించాయి. శనగ పంట విక్రయించిన రూ.36 వేలు, గల్లగురిగిలో పోగుచేసిన రూ.20 వేలను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కోతుల దాడిలో మహిళకు గాయాలు
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్‌లోకు చెందిన మమతపై మంగళవారం కోతుల దాడి చేసి గాయపర్చింది. సోమవారం రాత్రి కుక్కల దాడిలో అదే గ్రామానికి చెందిన ఆశల లచ్చన్న, చిన్నారి వేదశ్రీకి గాయాలయ్యాయి. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఓ మహిళపై కోతులు దాడి చేసి గాయపర్చింది.
సాగునీటికోసం రైతుల ఆందోళన
దండేపల్లి: కడెం ఆయకట్టు కింద యాసంగి పంటలకు వారబంధీ పద్ధతిలో అందిస్తున్న సాగునీరు సక్రమంగా అందడంలేదని డిస్ట్రిబ్యూటరీ 24బీ పరిధిలోని మాకులపేట, తాళ్లపేట గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కడెం ప్రధాన కాలువలో దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగికి సాగునీరందిస్తామని అధికారులు చెప్పడంతో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశామని, పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ డీఈ వెంకటేశం, ఏఈఈ శ్రావణ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment