షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
బజార్‌హత్నూర్: మండలంలోని అనంతపూర్‌లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో కోరెంగ హన్మంతు ఇల్లు దగ్ధమైంది. విద్యుత్ వైరు తెగి ఇంటిపై కప్పుపై పడటంతో మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి మంటలార్పేందుకు యత్నించారు. ఇచ్చోడ నుంచి ఫైరింజన్ అక్కడికి చేరుకుని మంటలార్పివేసింది. తహసీల్దార్ శ్యాంసుందర్ ఆదేశాలతో మంగళవారం ఎంఆర్‌ఐ నూర్‌సింగ్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో రూ.2.50 లక్షల నగదు, 3.5 తులాల బంగారం, 50 తులాల వెండి, టీవీ, కూలర్, సోఫాసెట్, బెడ్స్, జొన్నలు, గోధుమ పంట, కందులు, బియ్యం, సర్టిఫికెట్లు కాలిపోయాయి. సుమారు రూ. 17 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ సోయం బాపురావ్ అక్కడికి చేరుకుని పరిశీలించి బాధిత కుటుంబానికి రూ.20 వేలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment