కాసిపేట: రాష్ట్రప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఏజెన్సీ అలవెన్స్ అందిస్తున్నా స్థానికంగా ఉండకపోవడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మండలంలోని లంబాడీతండా, కాసిపేట, ముత్యంపల్లి, ధర్మరావుపే ట, దేవాపూర్ జెడ్పీ పాఠశాలలు, మోడల్, కేజీబీ వీ, రేగులగూడ, మల్కేపల్లి, దేవాపూర్ గిరిజన ఆ శ్రమ పాఠశాలలుండగా సుమారు 100 మంది వ రకు టీచర్లున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి మండలంలో 16 మంది టీచర్లు ఓటరుగా నమోదు చేసుకోగా, ఇందులో 10 మంది ఈ మండలానికి చెందిన ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నవా రే. మిగతా ఆరుగురు కాసిపేట మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసే స్థాని కులు ఆరుగురే ఓటర్లుగా నమోదు చేసుకోవడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. అంటే తొంబై శాతానికిపైగా టీచర్లు జిల్లా కేంద్రం, ఇతర దూరప్రాంతాల నుంచి వస్తూ ఏజెన్సీ అలవెన్స్‌లు పొందుతున్నారు.ఎస్‌ఏల పరిస్థితి ఇలా ఉంటే ఎస్జీటీలు, ఉద్యోగులు, అధికారులు కూడా 85 శాతానికి పైగా ఇతర ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతున్నవారే కావడం గమనార్హం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జాబితా చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నా రు. ఏజెన్సీ అలవెన్స్‌లు పొందుతూ ప ట్టణప్రాంతాల నుంచి రావడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని మండలవాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment