సూర్యాపూర్‌లో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు
కుంటాల: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని సూర్యాపూర్‌లో గురువారం అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించారు. నిజామాబాద్, కరీంనగర్‌తోపాటు కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది మల్లయోధులు పాల్గొన్నారు. అంతకుముందు సూర్యాపూర్ రాజరాజేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు చేశారు. అనంతరం కుస్తీ పోటీలను వీక్షించారు. పోటీల్లో గెలుపొందిన విజేతకు రూ.6100 నగదు, వెండి కడియం బహూకరించి సన్మానించారు. రెండో విజేతకు రూ.3 వేల నగదు అందజేసి సత్కరించారు. ఎస్సై సీహెచ్ భాస్కరాచారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు వెంగల్‌రావు, రాజరాజేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment