పెరిగిన ఓటు.. మొగ్గు ఎటు?
నిర్మల్
ఘనంగా సైన్సు దినోత్సవం
జాతీయ సైన్సు దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సైన్స్ ఫెయిర్‌లో వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు.
బాబోయ్ దొంగలు
తానూరు మండలంలోని పలు గ్రామాల్లో వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వారం రోజుల్లోనే నాలుగు వరుస దొంగతనాలు జరిగాయి.
శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
9లోu
ఆ ఉపాధ్యాయులను
అరెస్టు చేయండి
● నర్సాపూర్ పోలీసులకు ఎస్పీ ఆదేశం
నర్సాపూర్ (జి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ రాజేశ్‌మీనా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు. కేసుల పురోగతిపై వివరాలను ఎస్సై సాయికిరణ్‌ను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేసినా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వెంటనే వారు ఎక్కడ ఉన్నా అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు.
‘హలో అన్న.. మీ నిజామాబాద్‌ల ఓట్లు ఎటేసిండ్రు.. ఎవరికి ఎక్కువచ్చేటట్లున్నయ్..? మా ఆదిలాబాద్‌లైతే ఎటూ చెప్పస్తలేదు. మెదక్, కరీంనగర్‌ల కూడా ఇట్లనే ఉన్నదట. టీచర్లదైతే పక్కా అయినట్లే కనిపిస్తున్నది కన్ని.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీదే చెప్పస్తలేదని అంటున్నరు...’ ఇలా పోలింగ్ పూర్తయిన నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు. తమ జిల్లానే కాదు.. మిగిలిన మూడు ఉమ్మడి జిల్లాల్లోని తమ దోస్తులు, బంధువులకూ ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టభద్రులు, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గణనీయంగా పోలింగ్ నమోదైంది.
–నిర్మల్
గతానికి భిన్నంగా..
ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు గతానికి భిన్నంగా జరిగాయని చెప్పొచ్చు. సంబంధిత అధికారులకంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని రంగంలోకి దిగిన అభ్యర్థులు ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ కోసం విశేష కృషిచేశారు. బలమైన ప్రత్యర్థులు ఉండటంతో అభ్యర్థులు ఎన్నికలతోపాటు ఎన్‌రోల్‌మెంట్ కోసమూ పోటీపడాల్సి వచ్చింది. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక టీమ్‌లను పెట్టుకున్నారు. ‘హలో మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎన్‌రోల్ చేయించుకున్నారా..!?’ అంటూ తరచూ ఫోన్లు చేస్తూ పట్టభద్రులు, టీచర్ ఓటర్లను పెంచే ప్రయత్నం చేశారు. ఈమేరకు గత ఎన్నికల కంటే ఓటర్ల సంఖ్య పెరగడం గమనార్హం. ఓటర్లుగా ఎన్‌రోల్ చేయించుకోవడమే కాకుండా.. ఈసారి ఓపికగా గంటలపాటు వరుసలో నిల్చోని మరీ తమ ఓటును వేశారు.
క్యాస్ట్–క్యాష్ ఈక్వేషన్‌లో..
మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కులం, డబ్బు బాగానే ప్రభావం చూపాయన్న చర్చ కొనసాగింది. పార్టీలు సైతం వీటి ఆధారంగానే అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇందులో ఏపార్టీకి ఏది వర్కవుట్ అయ్యిందనే దానిపైనా లెక్కలు వేస్తున్నారు. అభ్యర్థులు, పార్టీలు మాత్రం ఎవరిది వారే గెలుపు ఖాయమన్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు కాస్త ముందు తెరపైకి వచ్చిన బీసీ నినాదం, బరిలో నిలువకుండా ఉన్న బీఆర్‌ఎస్ సహకారం, అభ్యర్థుల తీరుతెన్నులు, పార్టీలకు ఉన్న ఆదరణ వీటితో పాటు చివర్లో డబ్బులూ పోలింగ్‌పై ప్రభావం చూపినట్లు చాలామంది ఓటర్లు అంచనా వేస్తున్నారు. ఈసారి టీచర్ల ఎమ్మెల్సీ స్థానం కంటే పట్టభద్రుల స్థానంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. ఎమ్మెల్సీ పోలింగ్, కౌంటింగ్ భిన్నంగా ఉండటం, పట్టభద్రులు, టీచర్లు చదువుకున్నవారు కావడం, నియోజకవర్గాలు నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండటంతో ఫలితాలపై పక్కాగా అంచనా వేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.
న్యూస్‌రీల్
ఓట్లు ఎటుపడ్డయో..!
జిల్లావ్యాప్తంగా పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ కావడమూ చర్చనీయాంశంగా మారింది. ఈ ఓట్లు ఎటుపడ్డాయోనని పోలింగ్ పూర్తయిన నుంచే లెక్కలు వేస్తున్నారు. ప్రధానంగా పోటీ చేసిన అభ్యర్థులు, వారి పార్టీల నేతలు తమ దగ్గరగా ఉండే వివిధ వర్గాల వారికి ఫోన్లు చేస్తూ.. ఓటింగ్ సరళిపై ఆరాతీస్తున్నారు. వారు చెప్పిన అంశాలను నోట్ చేసుకుంటూ ఓట్ల లెక్కలపై అంచనా వేసుకుంటున్నారు.
రికార్డు స్థాయిలో ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
భారీగా పెరిగిన ‘గ్రాడ్యుయేట్స్’
టీచర్స్ ఓటింగ్ కూడా..
గత ఎన్నికలను మించి పోలింగ్
ఓట్లు ఎటు పడ్డాయంటూ ఆరా
పెరిగిన పోలింగ్..
గత ఎన్నికల్లో పట్టభద్రుల స్థానానికి 56.69శాతం ఓట్లు నమోదుకాగా, ఈసారి 72.59(నిర్మల్ డివిజన్–72.77 భైంసా డివిజన్–72.12)శాతం నమోదైంది. ఈలెక్కన ఈసారి పట్టభద్రులు ఏకంగా 15.9శాతం ఓటింగ్‌ను పెంచారు. ఉపాధ్యాయుల పోలింగ్‌శాతంతో పోలిస్తే మొత్తం ఓటర్లలో తక్కువగా నమోదైనా.. గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం గణనీయంగా పెరిగింది. ఇక ఉపాధ్యాయుల స్థానానికి గత ఎన్నికల్లో 82 శాతం ఓట్లు పడ్డాయి. ఈసారి 89.27(నిర్మల్ డివిజన్–89.07 భైంసా డివిజన్–89.73)శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే మరో 7.27శాతం ఓటింగ్ పెరగడం గమనార్హం. తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ అందులో దాదాపు 90 శాతం పోల్ అవ్వడంపై ఉపాధ్యాయ, అధికారవర్గాలూ హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
పెరిగిన ఓటు.. మొగ్గు ఎటు?
Comments
Please login to add a commentAdd a comment