నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Sun, Mar 2 2025 1:03 AM | Last Updated on Sun, Mar 2 2025 1:02 AM

నిర్మ

నిర్మల్‌

లెక్కింపు పెద్ద కథే..!
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 3న కరీంనగర్‌లో జరగనుంది. ఫలితం తేలేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025

8లోu

బాలుర వసతి గృహం తనిఖీ

నర్సాపూర్‌(జి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్టీ బాలుర వసతి గృహాన్ని జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి జాదవ్‌ అంబాజీ శనివారం తనిఖీ చేశారు. హాస్టల్‌లో సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల విద్యార్థులకు చికున్‌ పాక్స్‌ సోకడంతో వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రమోద్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రియాంక, డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ హేమ, పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌ దుర్గాభవాని, హెచ్‌ఎం ముత్యం పాల్గొన్నారు.

సైవేని(40) అనే మహిళ కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పి, మైకం, వికారం వంటి లక్షణాలతో బాధపడుతుంది. ఎన్‌సీడీ సర్వేలో ఈమెకు పరీక్షలు నిర్వహించగా అధిక రక్తపోటు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ముందస్తుగా వ్యాధిని గుర్తించడంతో ఆమె మందులు వాడి ప్రస్తుతం రక్తపోటును అదుపులో ఉంచుకుంది.

జీవన శైలిలో మార్పు రావాలి..

ప్రస్తుతం 30 ఏళ్లకే బీపీ, షుగర్‌ వస్తోంది. జీవన శైలిలో స్వల్ప మార్పులతోనే వీటిని అరికట్టవచ్చు. యువత జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడడం, వాకింగ్‌ చేయకపోవడంతో ఈ వ్యాధులు వస్తున్నాయి. ఆహారంలో ఉప్పు చాలా మేరకు తగ్గించి ఒత్తిడి లేకుండా జీవించాలి. నిర్ణీత సమయంలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు.

– డాక్టర్‌ శ్రీనివాస్‌,

ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి

వ్యాయామం లేకనే..

ఒత్తిడి కారణంగా ఈ జబ్బులొస్తున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారం తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్‌ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే వారిని క్రీడలవైపు మళ్లించాలి. పెద్దవారు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

– డాక్టర్‌ రత్నాకర్‌, ఫిజీషియన్‌

జిల్లా కేంద్రానికి చెందిన జమున(35) అనే మహిళకు కొద్ది రోజులుగా అధిక దాహం, అధిక మూత్ర విసర్జనతో ఇబ్బంది పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య శాఖ ద్వారా చేపట్టిన ఎన్‌సీడీ సర్వేలో వైద్య సిబ్బంది ఆమెకు పరీక్షలు చేశారు. ఇందులో జమునకు షుగర్‌ నిర్ధారణ అయింది. దీంతో వైద్య సిబ్బంది ఆమెకు మందులు అందజేసి వ్యాధి అదుపులో ఉండేందుకు సూచనలు చేశారు.

రోజుల్లో ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పోషకాలున్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇక ఉరకలేస్తున్న యువత ఉడుకు నెత్తురులోకి బీపీ, షుగర్‌ ప్రవేశిస్తున్నాయి. గుట్టుగా ఒంట్లోకి జొరబడి.. మెల్లగా ఆరోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. వృద్ధాప్యంలో రావాల్సిన ఈ జబ్బులు.. 30 ఏళ్లు దాటగానే బయటపడడం కలవరపెడుతోంది

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో 30 ఏళ్లు దాటిన వారు వ్యాధులబారిన పడుతున్నారు. రక్తపోటు, మధుమేహం సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ రెండు వ్యాధులు వారిని ఆస్పత్రులపాలు చేస్తున్నాయి. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీస్‌(ఎన్‌సీడీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలుచేస్తూ బీపీ, షుగర్‌ బాధితులను గుర్తించి వైద్యంతోపాటు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన స్క్రీనింగ్‌లో 79,199 మందికి బీపీ, 37, 902 మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు జిల్లాలోని ఎన్‌సీడీ కార్నర్లు, క్లినిక్‌ల ద్వారా అందిస్తున్న సేవలు విస్తృతం కావడం, పెద్దసంఖ్యలో పరీక్షలు చేస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. అదేస్థాయిలో చికిత్స కూడా అందుతోంది.

వంశపారపర్యంగానూ..

డయాబెటిస్‌ ఎక్కువగా వంశపార్యపరంగా, వయస్సు పెరిగే కొద్దీ వస్తోంది. దీంతోపాటు స్మోకింగ్‌, ఆల్కహాల్‌ అలవాటు ఉండటం వల్ల పాంక్రియాటిక్‌ గ్రంథిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గి ఈ వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. చిన్నారులు నిత్యం టీవీ ఎదుట కూర్చొని చిరుతిండి తినడం, ఎలాంటి వ్యాయామం లేకుండా ఉండటం వల్ల ఊబకాయం పెరిగి అది డయాబెటిస్‌కు దారి తీస్తోంది. దీంతో శరీరం అధికంగా లావు పెరుగుతుంది. చిన్న వయసులో ఎత్తు కంటే అధికంగా బరువు పెరగడం వల్ల రాత్రి నిద్రించే సమయంలో కొన నాలుక అడ్డుపడి నిద్ర పట్టక మానసిక ఒత్తిడికి గురవుతారు.

నిర్లక్ష్యంతో పెరుగుతున్న నష్టం..

చాలా మంది బీపీ, షుగర్‌ బాధితులు తాము వాటి బారిన పడిన సంగతే గుర్తించడం లేదు. నిర్లక్ష్య ధోరణి కారణంగా రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, తగిన వ్యాయామం లేకపోవడం, సమయానికి తినకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన జనాభాలో 79,199 మంది బీపీ, 37,902 మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు తేలింది.

చిన్నారులూ.. బాధితులే

ఇటీవల కాలంలో పిల్లల్లోనూ డయాబెటిస్‌ బయట పడటం ఆందోళన కలిగిస్తోంది. జన్యుపరమైన లో పంతో పుట్టిన సమయంలోనే ఎక్కువగా పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. ఇటీవల పదేళ్లలోపు పిల్లలూ ఈ వ్యాధి బారినపడుతున్నా రు. త్వరగా అలసిపోవడంతోపాటు వెనువెంటనే ఆకలిగా అనిపించడంతో బాధిత పిల్లలు చదువుతో పాటు ఇతర ఆటలపై దృష్టి పెట్టలేకపోతున్నారు.

న్యూస్‌రీల్‌

30 ఏళ్లు దాటగానే ముసురుకుంటున్న వ్యాధులు

ఎన్సీడీ స్కీన్రింగ్‌తో గుర్తింపు..

మారుతున్న జీవనశైలే కారణమంటున్న వైద్యులు

ఒత్తిడి, తీరిక లేని శ్రమతో మానసిక స్థితిపై ప్రభావం

నియంత్రణే మార్గం

రక్తపోటు, మధుమేహం ఒక్కసారి సోకితే నియంత్రణ తప్ప నివారణకు అవకాశం ఉండదు. ఇలాంటి వ్యాధుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద నాన్‌ కమ్యూనికేబుల్‌ డీసీస్‌ కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించింది. 30 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం గురయ్యే వారిని గుర్తించి ముందస్తుగా వారికి వైద్యసేవలు అందించడం.. తద్వారా వారి ఆయుష్షును పొడిగించడం ఈ పథకం లక్ష్యం. జిల్లాలో పలు విడతలుగా సర్వే నిర్వహించి బీపీ, షుగర్‌ బాధితులను గుర్తించగా, సంబంధిత సెంటర్ల ద్వారా మందులు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్మల్‌1
1/7

నిర్మల్‌

నిర్మల్‌2
2/7

నిర్మల్‌

నిర్మల్‌3
3/7

నిర్మల్‌

నిర్మల్‌4
4/7

నిర్మల్‌

నిర్మల్‌5
5/7

నిర్మల్‌

నిర్మల్‌6
6/7

నిర్మల్‌

నిర్మల్‌7
7/7

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement