నిర్మల్
ఔట్ సోర్సింగ్ గందరగోళం
ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్ల నియామకంపై గందరగోళం నెలకొంది. అధికారిక ప్రకటన జా రీ కాకున్నా ఔట్ సోర్సింగ్ సంస్థలు పోస్టుల భర్తీకి అత్యుత్సాహం చూపాయి.
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
8లో
ఘనంగా మాజీ స్పీకర్
శ్రీపాదరావు జయంతి
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పోలీస్ సాయుధ దళ ముఖ్య కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించా రు. పోలీస్ అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రాంనిరంజన్‌రావు, శేఖర్, రమేశ్, రామకృష్ణ, ఆర్‌ఎస్సైలు వినోద్, రవి, సిబ్బంది పాల్గొన్నారు.
భైంసాటౌన్: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని వేలం వేసిన అధికారులు దక్కించుకున్న వ్యక్తి నుంచి గడువులోపు డబ్బులు రాబట్టడంలో విఫలమయ్యారు. సదరు వ్యక్తి పన్నాగాన్ని పసిగట్టలేక పోతున్న అధికారుల తీరుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి లారీలో పీడీఎస్ బియ్యం తరలిస్తూ భైంసా పట్టణంలో కారును ఢీకొన్న ప్రమాదంలో పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేక దృష్టి సారించి అక్రమదందా గుట్టురట్టు చేశారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి జిల్లా నుంచి పీడీఎస్ బియ్యం సేకరించి తిరిగి జిల్లాకే తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ధర్మాబాద్‌లోని అతడి స్థావరంపై దాడి చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు కూడా నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న 360 క్వింటాళ్ల బియ్యానికి రెవెన్యూ అధికారులు ఇటీవల బహిరంగ వేలం నిర్వహించారు. ధర్మాబాద్‌కే చెందిన ఓ వ్యక్తి క్వింటాల్‌కు రూ.3,100 చొప్పున బియ్యం దక్కించుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వేలంలో దక్కి ంచుకున్న బియ్యానికి సంబంధించి ఈనెల 24లోపు రూ.11.16లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ, సదరు వ్యక్తి ఇప్పటివరకు డబ్బులు చెల్లించకుండా తాత్సా రం చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులు అడిగితే రేపు, మాపంటూ జాప్యం చేస్తున్నట్లు తెలిసింది.
ఆంతర్యమేమిటంటే..?
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్లుగా పీడీఎస్ బి య్యం అక్రమదందా యథేచ్ఛగా సాగిస్తున్నాడు. జిల్లా నుంచి ఏజెంట్ల ద్వారా బియ్యం సేకరించి తిరి గి లారీల్లో జిల్లాలోని రైస్‌మిల్లులు, ఇతరులకు పంపుతున్నాడు. ఈ దందాలో ఆరితేరిన సదరు వ్యక్తి రూ.కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. గతంలో భైంసా మండలంలోని దేగాంలోనూ ఇతనికి చెందిన పీడీఎస్ బియ్యం దాదాపు 270 క్వింటాళ్లు పట్టుబడగా, అప్పుడు కూడా పట్టణంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో భద్రపరిచారు. కానీ, కొద్దిరోజులకే బియ్యం రిలీజ్ చేయించుకున్నాడు. ఈసారి కూడా ఆ పద్ధతిలోనే బియ్యం రిలీజ్ చేయించుకునేందుకు యత్నించినట్లు తెలిసింది. కాగా, రెవెన్యూ అధికారులు బహిరంగ వేలం నిర్వహించడంతో అ తడి పన్నాగం ఫలించలేదు. అయినా, బియ్యం ద క్కించుకునేందుకు ధర్మాబాద్‌కు చెందిన అతని వ్యక్తినే వేలంలోకి దింపినట్లు తెలిసింది. కాగా, వే లానికి ఒకరోజు ముందు ప్రభుత్వ ధరను క్వింటాల్ కు రూ.2,100కు నిర్ణయించేలా సదరు వ్యాపారి ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఇందుకుగాను పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులతోనూ రెవె న్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. వా రు ససేమిరా అనడంతో కిలోకు రూ.25 నుంచి వేల ం ప్రారంభించారు. పోటీగా మరో ఇద్దరు పాల్గొనడంతో రూ.31కి కిలో చొప్పున దక్కించుకున్నాడు. కానీ, గడువులోపు డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తగిన చర్యలు తీసుకుంటాం
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఫిబ్రవరి 22న వేలం నిర్వహించాం. ధర్మాబాద్‌కు చెందిన వ్యక్తి కిలోకు రూ.31 చొప్పున రూ.11.16లక్షలకు దక్కించుకున్నాడు. అదే నెల 24లోపు చెల్లించాలని గడువు విధించినా ఇప్పటివరకు చెల్లించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటాం.
– ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్, భైంసా
న్యూస్‌రీల్
పట్టుకున్న పీడీఎస్ రైస్‌కు వేలం
360 క్వింటాళ్లకు రూ.11.16 లక్షలు
దక్కించుకున్న మహారాష్ట్ర వ్యక్తి
పైకం చెల్లించడంలో తాత్సారం
అధికారుల తీరుపై అనుమానం!
తక్కువ ధరకు కొట్టేసే యత్నం
వేలంలో బియ్యం దక్కించుకున్న వ్యాపారి ఏజెంట్ల ద్వారా కిలోకు రూ.25 నుంచి రూ.27వరకు సేకరిస్తుంటాడు. కానీ, గిట్టుబాటు కాకున్నా వేలంలో రూ.31కి దక్కించుకోవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో మాదిరి బియ్యం రిలీజ్ చేయించుకునేందుకు తెరవెనుక యత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవున్నాయి. జాప్యం చేయడం ద్వారా ఎలాగైనా బియ్యాన్ని తక్కువ ధరకు దక్కించుకోవడం లేదా రిలీజ్ చేయించుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సంబంధిత అధికారులు ప్రస్తుత వేలానికి సంబంధించిన డబ్బులు త్వరగా వసూలు చేయాలి. లేదా మరోసారి వేలం నిర్వహించి వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో సదరు వ్యాపారి ఎత్తుగడ ఫలించి బియ్యం గతంలోలాగా చేజిక్కుంచుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మల్
నిర్మల్
నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment