నిర్మల్‌చైన్‌గేట్: ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో చేపట్టే లేప్రసీ కేస్ డిటెక్షన్ కార్యక్రమం కొనసాగుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరో గ్య శాఖ అధికారి కార్యాలయంలో గురువా రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే కుష్ఠు వ్యాధిని గుర్తించి చి కిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా, వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి కుష్ఠు వ్యాధిని గుర్తించడానికి ప్రతి ఒక్కరినీ పరీక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి లెప్రసీ కేసులు గుర్తించి చికిత్సలు అందించాలన్నారు. కార్యక్రమంలో కార్యక్ర మ నిర్వహణ అధికారి రవీందర్‌రెడ్డి, డిప్యూ టీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారే రవీందర్ డిప్యూటీ పీఎంవో రాజేశ్వర్, ఫిజి యోథెరపిస్ట్ కిషనరావు, వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షక అధికారులు పాల్గొన్నారు.