భైంసాటౌన్: నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.1.12 కోట్లు మంజూరైనట్లు భైంసా ఏఎంసీ చైర్మన్ సింధే ఆనంద్‌రావు పటేల్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి సీతక్కను గతంలో కోరినట్లు తెలిపారు. ఈ మేరకు రూ.1.12కోట్ల నిధులు మంజూరు చేస్తూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 27 పనులకు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి సీతక్క, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.