● 48 గంటల మహా ధర్నా షురూ.. ● తొలిరోజు ఆర్డీవో కార్యాలయం ఎదుట వంటావార్పు ● హామీలు నెరవేర్చాలని డిమాండ్
నిర్మల్‌చైన్‌గేట్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం రద్దు, ఐసీడీఎస్ పథకం ప్రారంభమై 50 ఏళ్లు అవుతున్నా.. సమస్యలు తీరడం లేదని అంగన్‌వాడీ టీచర్స్, మినీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలు పరిష్కరించి పర్మినెంట్ చేయాలని.. తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు పోరుబాట పట్టారు. నిర్మల్ ఆర్డీవో ఎదుట సోమవారం 48 గంటల ధర్నా ప్రారంభించారు. తమ సమస్యల పరిష్కారానికి 17, 18 తేదీల్లో అంగన్‌వాడీ సెంటర్ల బంద్ నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఆర్డీవో కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. రాత్రి అక్కడే నిద్రించారు. ఆశ వర్కర్ యూనియన్ అంగన్‌వాడీల ధర్నాకు మద్దతు తెలిపింది. ఆందోళనలో ఆశ వర్క ర్లు చంద్రకళ, భాగ్య, రామలక్ష్మి, అంగన్‌వాడీ యూ నియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లలిత, జిల్లా కోశాధికారి శైలజ, జిల్లా ఉపాధ్యక్షులు గంగామణి, రజియా విజయ, ప్రసాద, భాగ్య, వనజ, జిల్లా సహాయ కార్యదర్శి, భాగ్య, రేష్మ, విజయ, వందన, దేవిక లావణ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.
రాత్రి శిబిరంలోనే నిద్రిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు
అంగన్‌వాడీల పోరుబాట