ఇక్కడ పారుతున్న చెరువు ఒర్రెలో నుంచి నీటిని పైపుల ద్వారా తన పొలానికి మళ్లించుకునేందుకు తిప్పలు పడుతున్న రైతు పేరు నర్సారెడ్డి. లోకేశ్వరం మండలం ధర్మోరాకు చెందిన ఈయన రెండున్నరెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేస్తున్నాడు. బోరు ఎత్తిపోవడంతో దగ్గరలోని చెరువుకింద ఒర్రె నుంచి ఇలా పైపులు వేసుకుంటూ పంటకు నీరందించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
నిండువేసవిలోనూ నిండుకుండల్లా చెరువులు, మండిపోతున్న ఉష్ణోగ్రతల్లోనూ పచ్చగా పండుతున్న పంటలు.. ఎటుచూసినా కాలువలు, వరి ధాన్యపు సిరులు. లక్ష్మణచాంద మండలం జిల్లాలో కోనసీమను తలపిస్తోంది. సరస్వతీ కాలువ, కాకతీయుల నాటి చెరువుల పుణ్యాన ఈ ప్రాంతమంతా ఎప్పుడూ పచ్చగా ఉంటోంది. ఈ ఒక్క మండలంలోనే 40 వరకు చెరువులు ఉన్నాయి. సరస్వతీ కెనాల్‌తో నిండుతూ పంటలకు అండగా ఉంటున్నాయి. ఈ వేసవిలోనూ తమ పంటలకు ఏమాత్రం ఢోకా లేదని ఇక్కడి రైతులు అంటున్నారు.
ఇక్కడ.. గొర్రెలు మేస్తున్న తన పొలంతో సెల్ఫీ తీసుకుంటున్న యువరైతు పేరు ప్రవీణ్. దిలావర్‌పూర్ మండలకేంద్రానికి చెందిన ఈయనకు రెండున్నర ఎకరాల సాగుభూమి ఉంది. బోరుబావును నమ్ముకుని వరిసాగు చేశాడు. కానీ.. వేసవి మొదట్లోనే పాతాళగంగ దెబ్బ కొట్టింది. వారం నుంచి బోరు ఎత్తిపోవడంతో నీరు లేక పొలం ఎండుతోంది. చివరకు చేసేది లేక ఇలా.. తన పొలాన్ని మూగజీవాలు మేపడానికి ఇచ్చేశాడు. ఈ సీజన్‌సాగులో నీరందక రూ.30 వేలు నష్టపోయినట్లు వాపోతున్నాడు.
పంట ఎండిపోయింది..
కుంటాల మండలం దౌనెల్లికి చెందిన రైతు అలీమ్. యాసంగి పంటగా రెండెకరాల్లో జొన్న సాగు చేశాడు. భూగర్భజలాలు అడుగంటిపోయి, పంటకు బోరు నీళ్లు అందలేదు. దీంతో జొన్న పంట మొత్తం ఎండిపోయింది. నీరందితే 30–40 క్వింటాళ్ల పంటదిగుబడి వచ్చేదని బాధిత రైతు తెలిపాడు. ఇపుడు ఐదారు క్వింటాళ్లు కూడా వస్తాయో లేవోనని అలీమ్ వాపోతున్నాడు. బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతున్నాడు.
అడుగంటిన బావి..
బీడువారిన భూమి
కడెం మండలం సదర్‌మట్ ఆయకట్టు చివరి భూములకు పక్షం రోజులుగా నీరందడం లేదు. చివరి ఆయకట్టు వరకు నీరందకపోవడంతో వరిపొలాలు బీడువారాయి. వేసవి ప్రారంభంలోనే ఇక్కడ బావులు, బోరుబావులూ అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే ఈభూములను కలెక్టర్, జిల్లా అధికారులూ పరిశీలించారు.
పొలం.. గొర్రెల పాలు..
చెరువు..
ఆయకట్టు ఆదరువు
● నదీమాతల్లులే ‘నిర్మల్’కు అండ ● ‘సరస్వతీ’కటాక్షంతో పచ
● నదీమాతల్లులే ‘నిర్మల్’కు అండ ● ‘సరస్వతీ’కటాక్షంతో పచ