● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటి కే పలువురు దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తున్నారని గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ రుసుములో 25 శాతం రా యితీ కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విని యోగించుకుని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులంతా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలన్నారు. మార్చి 31తో రాయితీ గడువు ముగుస్తుందన్నారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజుల చెల్లించి రెగ్యులర్ చేసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, యాదవ్‌కృష్ణ, రాజేశ్‌కుమార్ పాల్గొన్నారు.
అర్హులైన దివ్యాంగులకు యూడీఐడీ కార్డు
అర్హులైన దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూడీఐడీ కార్డుల జారీ మార్గదర్శకాలు, దివ్యంగుల సమస్యలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు, దివ్యాంగులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికెట్‌కు బదులుగా అర్హులైన ప్రతీ దివ్యాంగుడికి యూనిక్ డిసెబిలిటీ ఐడీ (యూడీఐడీ) నంబర్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 1 నుంచి దివ్యాంగుల పునరావాసం, సాధికారత కోసం డైనమిక్ వెబ్ ఎనేబుల్ సిస్టమ్‌ను రూపొందించిందన్నారు. సదరం సర్టిఫికెట్ ఉన్నవారు, నూతనంగా యూడీఐడీ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుని ఆసుపత్రిలో స్లాట్ బుకింగ్ చేసి, నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. తర్వాత కార్డులు జారీ అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్డులు 21 రకాల వైకల్యం ఉన్న దివ్యాంగులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ అర్హులైన దివ్యంగులకు ప్రభుత్వ పథకాల లబ్ధి, పునరావాసం, సాధికారతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం యూడీఐడీ కార్డుల జారీ మార్గదర్శకాలపై వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్‌సింగ్, దివ్యాంగులు, అధికారులు పాల్గొన్నారు.